ధవారం రాజకీయాల్లో రెండు ముఖ్య పరిణామాలు జరిగాయి. మైసూరు
భూములు సర్వే చేస్తున్న రెవెన్యూ సిబ్బంది
దొడ్డబళ్లాపురం/ శివాజీనగర: కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఆయన బావ, బెంగళూరు రూరల్ బీజేపీ ఎంపీ డా.మంజునాథ్, సమీప బంధువు డీసీ తమ్మణ్ణలకు చెందిన భూములపై సిద్దరామయ్య సర్కారు దృష్టి సారించింది. ఇప్పుడు ఇది తాజా వివాదమైంది. రామనగర వద్ద బిడది సమీపంలో కేతగానహళ్లిలోని కుమారస్వామి, బంధువులకు చెందిన భూములను రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సర్కారీ భూములను కబ్జా చేశారని ఆరోపణలు రావడంతో, హైకోర్టు ఆదేశాల మేరకే సర్వే చేసినట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వివిధ శాఖల నుంచి అత్యాధునిక సర్వే పరికరాలతో వచ్చిన అధికారులు మంగళవారం నుంచి సర్వే చేపట్టారు. నివేదికను ప్రభుత్వం రూపొందించిన సిట్ బృందానికి అందజేస్తామని తెలిపారు.
ఏమిటీ వ్యవహారం
ఇక్కడ సుమారు 110 ఎకరాల పొలాలు కుమారస్వామి, సోదరి, బావ తదితరుల పేర్లతో ఉన్నాయి. ఇందులో 14 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఒకరు సర్కారుకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో కేసు వేశారు. దీంతో సర్కారు సర్వేకు శ్రీకారం చుట్టింది. 40 మంది రెవెన్యూ సిబ్బంది సర్వేలో నిమగ్నమయ్యారు.
అవాస్తవం: ఎంపీ
భూ కబ్జా ఆరోపణలు, సర్వే వ్యవహారంపై ఎంపీ డా.మంజునాథ్ మండిపడ్డారు. ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. 1996లో తన తండ్రి కేతిగానహళ్లిలో ఖరీదు చేసిన 3.25 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చిందన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఈ వివరాలను నమోదు చేశానన్నారు. ఎంపీ అయ్యాక ఒక్క ఎకరా కూడా కొనలేదన్నారు.
బు
కేంద్ర మంత్రిపై సిద్దు సర్కారు దృష్టి
రామనగర వద్ద 110 ఎకరాలలో
సర్వే ప్రక్రియ
14 ఎకరాల భూ కబ్జా ఆరోపణలు
మండిపడిన కుమార వర్గం
Comments
Please login to add a commentAdd a comment