శివాజీనగర: బీజేపీ రాష్ట్రాధ్యక్షుని ఎంపిక, పునర్ నియామకంపై ఎలాంటి అనుమానం లేదని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర తెలిపారు. బుధవారం మల్లేశ్వరం బీజేపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎంపిక కావాల్సి ఉంది. త్వరలోనే హైకమాండ్‌కు జిల్లాధ్యక్షుల జాబితా వెళ్తుంది, పార్టీలోని అంతర్గత సమస్యలను నాయకత్వం దృష్టికి వెళ్లాయి, అవసరమైనవారికి నోటీసులు ఇచ్చారు అని తెలిపారు. కేంద్ర నాయకులు ఈ సమస్యలను పరిష్కరిస్తారన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి అందరితో కలసి వెళ్లేందుకు తాను సిద్ధమన్నారు. బసనగౌడ పాటిల్ యత్నాళ్ వర్గాన్ని రెబెల్ అనరాదు అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment