పశు మహోత్సవం
తుమకూరు: సిద్ధగంగా మఠం వేలాది ఆవులు, ఎద్దులతో కళకళలాడుతోంది. ఇందులో మామూలు నుంచి మేలుజాతి పశువులు రూ.లక్షలు పలుకుతున్నాయి. పది రోజుల్లో సిద్ధగంగ జాతర మహోత్సవం జరగనుంది. ముందస్తుగా పశువుల పరుస నిర్వహించడం ఆనవాయతీ. ఇక్కడ పశుజాతరకు కర్ణాటక మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పశువులు, మూగ జీవాలు తరలివస్తున్నాయి. కొనేందుకు, అమ్మేందుకు వచ్చిన రైతులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. ప్రతి ఏటా తాము సిద్ధగంగా జాతర పశువుల పరుసకు వస్తున్నట్లు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారని ఒక రైతు తెలిపారు. ఇప్పటినుంచి పశువుల అమ్మకాలు జోరుగా జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment