వేసవి దాహం తీరేదెట్టా?
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
బనశంకరి: వేసవికి ఇంకా 9, 10 రోజులు ఉండగానే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే చుర్రుమనే ఎండ, వేడిమి చికాకు పెడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే వేసవి కాలం, పరిష్కార చర్యలపై కసరత్తు చేపట్టింది.
ఫిబ్రవరిలో అధిక తాపం
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సాధారణం కంటే 2.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది. అలాగే ముంగారు వానలతో అధిక వర్షాలు కురుస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణబైరేగౌడ తెలిపారు. గురువారం వాతావరణం, ప్రకృతి వైపరీత్యాల మంత్రివర్గ ఉపకమిటీ సమావేశం జరిగింది. ఈ ఏడాదిలో వేసవి, తాగునీటి సమస్య, వర్షాలు, వ్యవసాయం, జలాశయాల్లో నీటి మట్టాల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
535 టీఎంసీల నీటి నిల్వలు
రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 14 జలాశయాల్లో ప్రస్తుతం నీటి నిల్వ 535 టీఎంసీలు ఉండగా, ఇది సరాసరి 60 శాతం అని చెప్పారు. గతేడాది ఇదే సమయంలో 332 టీఎంసీలు మాత్రమే ఉండేదని చెప్పారు. కొన్ని జలాశయాల్లో నీటిమట్టం సంతృప్తికరంగా లేదని అన్నారు. చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ, తుమకూరు, బెంగళూరునగర, రామనగర జిల్లాల్లో 13 తాలూకాలు పరిదిలో 66 గ్రామాల్లో తాగునీటి కొరత అధికంగా ఉందని అంగీకరించారు. ట్యాంకర్లు, బోర్‌వెల్స్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. చిక్కబళ్లాపుర, బెంగళూరునగర, కోలారు జిల్లాల్లో 5 నగర, స్థానిక సంస్థల్లో ట్యాంకర్, బోర్లు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాల కలెక్టర్లు, తహశీల్దార్లకు పీడీ అకౌంట్లలో రూ.488 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో పలు శాఖల మంత్రులు పాల్గొన్నారు.
సర్కారు కసరత్తు
డ్యాములలో నీటి మట్టాలపై సమీక్ష
తీవ్రంగా ఉన్నచోట ట్యాంకర్ల ద్వారా జలం
కార్చిచ్చులు
బెంగళూరులో వేడి సెగ మొదలైంది. గిరాకీ పెరగడంతో పెద్దమొత్తంలో కళింగర పండ్ల లోడ్లు వస్తున్నాయి. ఎండల వల్ల పలుచోట్ల కార్చిర్చు రేగుతోంది. గురువారం చిక్కమగళూరు దగ్గర కురువంగిలో అటవీప్రాంతంలో మంటలు వ్యాపించాయి. పెద్దమొత్తంలో గడ్డి, చెట్లు కాలిపోయాయి.
వేసవి దాహం తీరేదెట్టా?
వేసవి దాహం తీరేదెట్టా?
వేసవి దాహం తీరేదెట్టా?
Comments
Please login to add a commentAdd a comment