‘బ్రాండ్ బెంగళూరుకు’ దారి.. నమ్మ రోడ్లు
బనశంకరి: బ్రాండ్ బెంగళూరు నినాదంలో భాగంగా బెంగళూరు నగరంలో రోడ్లు ఎక్కువ కాలం మన్నేలా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని డిప్యూటీసీఎం డీకే.శివకుమార్ అన్నారు. బీబీఎంపీ కేంద్ర కార్యాలయలో గురువారం ఏర్పాటు చేసిన నమ్మరోడ్డు–2025 సెమినార్‌ను డిప్యూటీ సీఎం ప్రారంభించి మాట్లాడారు. నమ్మరోడ్డు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ప్రజల సలహాలతో కూడిన బుక్‌లెట్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రోడ్లు పక్కన మొక్కలు ఎక్కడ నాటాలి, విద్యుత్ స్తంభాలు, మెయిన్‌రోడ్లు ఎలా ఉండాలి, ఫుట్‌పాత్ మార్గాలు ఎలా నిర్మించాలి, ప్రజలు ఎలాంటి నిబంధనలు పాటించాలి, బస్టాండ్ల నిర్మాణం, మెట్రో పిల్లర్లు, సర్కిల్స్ ఆధునీకరణకు బుక్‌లెట్ ద్వారా సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.
ఆ వైర్లను కత్తిరించాలి
బయట రోడ్లు, వీధుల్లో వేలాడుతున్న టెలికాం సంస్థల వైర్లను భూగర్భంలో అమర్చాలని సూచించినా సంస్థలు పెడచెవిన పెట్టాయని, వాటిని కత్తిరిస్తే దారికి వస్తారని డీసీఎం తెలిపారు. ప్రతిపౌరుని ఆస్తి రక్షణ కోసం కొత్త చట్టాలను తీసుకువస్తామని ఈనెలాఖరున మీడియా సమావేశం నిర్వహించి బహిర్గతం చేస్తామన్నారు. సొరంగమార్గానికి భూస్వాధీనం, ఆర్థిక, సాంకేతిక అంశాలు సవాలుగా ఉన్నాయన్నారు. నూతన మెట్రోమార్గంలో డబుల్ డెక్కర్ సంచరిస్తుందని తెలిపారు. దాదాపు 1,700 కిలోమీటర్ల మేర రోడ్లను వైట్‌టాపింగ్ వేస్తున్నామని, రాజకాలువల పక్కన కొత్తరోడ్ల నిర్మాణం, పై వంతెనల నిర్మాణం తదితర ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని తెలిపారు.
కన్నడలో బోర్డులు ఉండాల్సిందే
ఎవరూ ఉన్నా లేకపోయినా మనరోడ్డు అనే బుక్‌లెట్ మార్గదర్శనం చేస్తుందని, బుక్‌లెట్‌లో ఉండే నిబంధనల ప్రకారమే పనిచేయాలని సూచించామని డీకే.శివకుమార్ తెలిపారు. కొత్త ఆలోచనలు ఇవ్వడానికి విద్యార్థులు, యువకులు ముందుకురావడం సంతోషకరమన్నారు. నామఫలకాల్లో కన్నడ భాష 60 శాతం ఉండాలని, ఇందులో ఎవరైనా తప్పుచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సదస్సులో బీబీఎంపీ కమిషనర్ తుషార్‌గిరినాథ్, ప్రత్యేకకమిషర్ అవినాశ్‌మెనన్ రాజేంద్రన్, బీఎంఆర్‌డీఏ కార్యదర్శి రాజేంద్రచోళన్, చీఫ్ ఇంజనీర్ ప్రహ్లాద్, డబ్ల్యూఆర్‌ఐ సీఈఓ మాదవపై, తదితరులు పాల్గొన్నారు.
బ్రోచర్ ఆవిష్కరణలో
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
‘బ్రాండ్ బెంగళూరుకు’ దారి.. నమ్మ రోడ్లు
‘బ్రాండ్ బెంగళూరుకు’ దారి.. నమ్మ రోడ్లు
Comments
Please login to add a commentAdd a comment