యువ జంట అనుమానాస్పద మృతి
యశవంతపుర: యువతీ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చిక్కమగళూరు తాలూకా దాసరహళ్లివద్ద వెలుగు చూసింది. మృతులను శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన మధు, మాగడికి చెందిన పూర్ణిమగా గుర్తించారు. పూర్ణిమ శవం కారులో, మధు మృతదేహం కారుకు కొద్ది దూరంలో చెట్టుకు వేలాడుతూ ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో చిక్కమగళూరు రూరల్ పోలీసులు వెళ్లి పరిశీలించారు. పూర్ణిమ గొంతుపై పిసికి చంపిన ఆనవాళ్లు ఉన్నాయి. కాగా మధు బెంగళూరులో కారు డ్రైవర్‌గా, పూర్ణిమ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తుంది. మధు నాలుగైదు ఏళ్ల నుంచి పూర్ణిమా ఇంటికి సమీపంలో బాడుగ ఇంటిలో ఉంటున్నాడు. పూర్ణిమా కుటుంబంతో విశ్వాసంగా మెలిగేవాడు. ఎనిమిది నెలల క్రితం పూర్ణిమ సోదరి వివాహంలోనూ మధు అన్నీ తానై వ్యవహరించాడు. పూర్ణిమా శివమొగ్గకు వెళ్లిన సమయంలో మధు ఇంటికి వెళ్లింది. బుధవారం సాయంత్రం స్కూల్ ముగించుకొని ఇంటికి బయల్దేరిన పూర్ణిమాను మధు తన కారులో ఎక్కించుకొని చిక్కమగళూరుకు తీసుకెళ్లాడు. అనంతరం ఏం జరిగిందో ఏమో ఇద్దరూ విగతజీవులుగా మారారు. ఫూర్ణిమ మెడలో ఉన్న బంగారు చైన్ మాయమైనట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేశారా? మధునే ఆమెను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చిక్కమగళూరు జిల్లాలో మృతదేహాలు
యువ జంట అనుమానాస్పద మృతి
Comments
Please login to add a commentAdd a comment