సవతికి చిత్రహింసలు
బాగేపల్లి: నా భర్తకే వల వేస్తావా అని రెండో భార్యను మొదటి భార్య బంధువులు ఫాంహౌస్‌లో బంధించి చిత్రహింసలకు గురిచేసిన ఘటన గుడిబండ తాలూకా జిగానహళ్లిలో జరిగింది. బెంగుళూరులోని రాజరాజేశ్వరి నగర నివాసి గంగరాజు తన అమ్మమ్మ గారి ఊరైన జిగానహళ్లికి వచ్చివెళ్తుండేవాడు. తన అక్క తరఫు బంధువులైన రాజేశ్వరిని ప్రేమించి పెళ్లాడాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయినా గంగరాజు బెంగళూరుకు చెందిన సంగీత అనే యువతిని కూడా ప్రేమించి మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. సంగీత, గంగరాజు బుధవారం జిగానహళ్లికి వచ్చారు. ఈక్రమంలో మొదటిభార్య బంధువులు సంగీతను ఫాంహౌస్‌లో బంధించి హింసించారు. పోలీసులు వచ్చి సంగీతను రక్షించి నిందితులను అరెస్టు చేశారు. సంగీత మొహం గుర్తుపట్టలేనంతగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment