చురుగ్గా హంపీ ఉత్సవ ప్రధాన వేదికల నిర్మాణం
హొసపేటె: ఈసారి హంపీ ఉత్సవ ప్రధాన వేదికల నిర్మాణం ఊపందుకుంది. విజయనగర శిల్ప కళా నమూనాలో హంపీ శ్రీవిరుపాక్షేశ్వర ఆలయంలోని ప్రధాన గోపుర నమూనాను వినియోగించి వేదికను ఆకర్షణీయంగా నిర్మించాలని జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. హంపీ ఉత్సవ ప్రధాన వేదిక నిర్మాణ పనులు చురుకుగా జరుగుతుండటంతో ఈసారి హంపీ ఉత్సవాలు మరింతగా వైభవంగా నిర్వహించేందుకు అడుగులు పడుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన వేదిక ప్రధాన ఆకర్షణ కనుక ఈ వేదికను విరుపాక్షేశ్వర ఆలయం ప్రధాన గోపురం, రాతి రథం, సాసివెకాళు గణపతి, అంజనేయస్వామి ఆలయం, హేమకూట పర్వతాలయం నమూనాలతో నిర్మిస్తుండటం చర్చనీయాశంగా మారింది. ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఉత్సవాలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment