ఎడమ కాలువకు ఏప్రిల్ వరకు నీరివ్వాలి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరు వదలాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు విరుపాక్షిగౌడ మాట్లాడారు. సింధనూరు, మాన్వి, రాయచూరు తాలూకాల్లో ఫిబ్రవరిలో సాగు చేసిన రెండో పంటకు ఏప్రిల్ వరకు నీరు వదలాలని కోరారు. 54వ డిస్ట్రిబ్యూటరీ వద్ద ఆరు అడుగుల మేర గేజ్ కాపాడేలా నీటిపారుదల శాఖ అధికారులకు జిల్లాధికారి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment