కుట్టుమిషన్ల పంపిణీ
హొసపేటె: ఆర్థికంగా వెనుకబడిన మహిళల సాధికారత కోసం హొసపేటె ఇన్నర్ వీల్ క్లబ్ ఎల్లవేళలా ముందుంటుందని, ఇతర క్లబ్‌లకు ఆదర్శంగా నిలుస్తుందని ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు సుష్మా ప్రసంశించారు. నగరంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుట్టుమిషన్లను పంపిణీ చేసి ఆమె మాట్లాడారు. డబ్బు ఉన్నవాళ్లంతా దాతలు కాదన్నారు. దానం చేసే గుణం ఉన్నవాళ్లకు మాత్రమే దానం గుణం ఉంటుందన్నారు. సమాజ సేవలో తమ వంతు తోడ్పాటును అందించే వారికి మానవత్వం ఉంటుందన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు సునీత, కార్యదర్శి రాజేశ్వరి, డాక్టర్ మహాదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment