కవి సర్వజ్ఞ జయంతి
రాయచూరు రూరల్: నగరంలో కవి సర్వజ్ఞ జయంతిని ఆచరించారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్‌లో కవి సర్వజ్ఞ చిత్రపటానికి శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పూలమాల వేసి పూజలు నిర్వహించారు. అనంతరం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో త్రిపది జయంతిని ప్రారంభించారు. తహసీల్దార్ సురేష్ వర్మ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న కుమ్మర సమాజం ఆర్థికంగా, సాంఘీకంగా, విద్యాపరంగా అభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో సమాజం అధ్యక్షుడు సురేంద్రబాబు, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఆంజనేయ, తిమ్మప్ప ఫిరంగిలున్నారు.
రేపు రాయచూరు మహోత్సవం
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 22న రాయచూరు మహోత్సవం–2025ను నిర్వహిస్తున్నట్లు డాజల్ సూపర్ స్టార్ వీరేంద్ర జాలదార్, విశ్వాస్ జాలదార్ వెల్లడించారు. గురువారం ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 1995 నుంచి ఇంతవరకు నృత్యం, సంగీత, గీతాలాపనలో ఎంతో మంది ప్రతిభావంతులను తెరపైకి తెచ్చామన్నారు. ఆరోజున నగరంలోని మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో రాయచూరు మహోత్సవం కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు.
శస్త్రచికిత్సతో కుళ్లిన
వెన్నెముక తొలగింపు
రాయచూరు రూరల్: నగరంలోని బాలంకు ఆస్పత్రిలో కుళ్లిన వెన్నెముకను శస్త్రచికిత్స ద్వారా తొలగించడంలో వైద్యులు సఫలీకృతులయ్యారు. ఓ రోగికి ఇటీవల బాలంకు ఆస్పత్రిలో డాక్టర్ శ్రీధర్‌రెడ్డి బృందం ఐదు గంటల పాటు శస్త్రచికిత్స చేసి కుళ్లిన వెన్నెముకను తొలగించారు. ఐదు నెలల క్రితం క్షయ వ్యాధి సోకిన వ్యక్తికి నరాలు బలహీనం కావడంతో సీటీ స్కాన్ పరీక్ష జరిపారు. మూడో స్పైనల్ కార్డు కుళ్లిపోయి ఆరోగ్యం క్షీణించడంతో శస్త్రచికిత్స చేసి కుళ్లిన వెన్నెముకను తొలగించి రోగి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ మేలుకుంది, యశ్‌వంత్, సర్ఫరాజ్‌లున్నారు.
ఎల్‌ఐసీ ఉద్యోగుల సమ్మె
బళ్లారి రూరల్: ఎల్‌ఐసీ సంస్థలో ఉద్యోగ నియామకాలను చేపట్టాలని ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన గంటపాటు వాకౌట్ సమ్మెలో భాగంగా గురువారం మధ్యాహ్నం బళ్లారి బ్రాంచ్–2లో సమ్మె చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘ కార్యదర్శి సూర్యనారాయణ మాట్లాడారు. ఎల్‌ఐసీ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో ఇప్పుడు పని చేస్తున్న ఉద్యోగులపై పని భారం పెరిగింది. దీంతో ఒత్తిడికి లోనవుతున్నారు. పాలసీదారులకు ఉత్తమ సేవలు అందించడానికి ఉద్యోగాల భర్తీ అత్యంత ఆవశ్యకమని తెలిపారు. ఇంతటి కఠిన పరిస్థితుల్లో ఎల్‌ఐసీ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోడానికి ముందుకు రాకపోవడంతో అఖిల భారత ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం దేశవ్యాప్తంగా గంట పాటు నిధులు బహిష్కరించి వాకౌట్ సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. యాజమాన్యం స్పందించక పోతే దేశవ్యాప్తంగా ఉగ్రపోరాటానికి పూనుకోనున్నట్లు తెలిపారు. సమ్మెలో అధ్యక్షుడు దత్తాత్రేయ, కోశాధికారి విఘ్నేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
విలువైన కెమెరా లెన్స్ చోరీ
హొసపేటె: తుంగభద్ర జలాశయం పోటు జలాల ప్రాంతంలోని గుండా అడవి సమీపంలో నిలిపి ఉన్న కారు అద్దాలు పగులగొట్టి ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌కు ఉపయోగించే కెమెరా లెన్స్‌లను దుండగులు చోరీ చేసిన ఘటన గురువారం జరిగింది. రూ.4 లక్షల విలువైన కెనాన్ ఆర్ 5 కెమెరా, లెన్స్ చోరీకి గురయ్యాయి. చోరీకి గురైన కెమెరా, లెన్స్ రాయచూరు జిల్లాలోని మాన్వికి చెందిన ఫోటోగ్రాఫర్ హుమయూన్‌కు చెందినవని పోలీసులు తెలిపారు. హుమయూన్ ఏపీ–40 ఏఎం–5041 నంబరుగల కారులో కెమెరా, లెన్స్ పెట్టుకొని ఫోటో షూట్ చేస్తున్నాడు. కారు వద్ద ఎవరూ లేకపోవడంతో అద్దాన్ని పగలగొట్టి కెమెరా, లెన్స్‌ను అపహరించారు. ఘటనపై మరియమ్మనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
కవి సర్వజ్ఞ జయంతి
కవి సర్వజ్ఞ జయంతి
కవి సర్వజ్ఞ జయంతి
Comments
Please login to add a commentAdd a comment