నేడు ఎల్లో జోగప్ప నిన్న అరమనె చిత్రం విడుదల
హుబ్లీ: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఎల్లో జోగప్ప నిన్న అరమనె సినిమాను విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు హయవదన, నిర్మాత పవన్ సీనికేరి తెలిపారు. వారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ పాండోరస్ బాక్స్ ప్రొడక్షన్స్ అండ్ కృష్ణఛాయ చిత్ర బ్యానర్‌లో ఈ చిత్రాన్ని బెంగళూరు, మైసూరు, ఉత్తర కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా బాగల్‌కోటె, విజయపుర, మహారాష్ట్రలోని పండరాపుర, ఆగ్రా, ఢిల్లీ, మనాలి, హిమాచల్‌ప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తరాఖండ్‌లో షూటింగ్ చేశామన్నారు. ఫొటోగ్రఫీ నటరాజ మాదాల, శివం సంగీతం అందించిన ఈ చిత్రంలో అంజన్ నాగేంద్ర, సంజనదాస్, శరత్ లోహితాశ్య, స్వాతి, దినేష్ మంగళూరు, దానప్ప ఉమేష్, విఠల పరీట, ఇలా విట్లా నటించారన్నారు.
దుకాణాల తొలగింపుపై నిరసన
రాయచూరు రూరల్: సింధనూరు–హైదరాబాద్ జాతీయ రహదారిలోని ఫుట్‌పాత్ దుకాణాలను తొలగించడం తగదని ఏిఐసీసీటీయూ డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నాగరాజ్ మాట్లాడారు. సింధనూరు–హైదరాబాద్ జాతీయ రహదారిలో ఫుట్‌పాత్‌పై వెలసిన, నిర్మించుకున్న దుకాణాల తొలగింపునకు నగరసభ, సిటీ కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారన్నారు. వ్యాపారులకు తగిన పరిహారం అందించాలన్నారు. లేకుంటే ప్రైవేట్ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు తీర్చడానికి ఇబ్బందిగా మారుతుందన్నారు. వీధుల్లో వ్యాపారులు, పుట్‌పాత్ వ్యాపారులకు పరిహారం, ప్రత్యామ్నాయం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
పేదలకు ఇళ్ల మంజూరుకు వినతి
రాయచూరు రూరల్: నగరంలోని మురికివాడల్లో నివాసమున్న పేదలకు ప్రమాణ పత్రాలను ఇచ్చి ఇళ్లను మంజూరు చేయాలని మురికివాడ ప్రాంత క్రియా సేన సమితి అధ్యక్షుడు జనార్దన డిమాండ్ చేశారు. గురువారం జిల్లాధికారి కార్యాలయంలో శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ అధ్యక్షతన వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. కేంద్ర, రారష్ట్‌ర ప్రభుత్వాలు నగరంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రూ.6 లక్షల్లో కేవలం స్లం బోర్డు అధికారులు రూ.3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. సగానికే నిర్మాణాలు చేపట్టి మిగిలిన భాగాన్ని పూర్తి చేయాలంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్నారు.
నిధుల దుర్వినియోగం.. ముగ్గురు అధికారుల సస్పెండ్
రాయచూరు రూరల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగ) నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై జిల్లాలోని లింగసూగూరు తాలూకా వ్యవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినట్లు జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే వెల్లడించారు. లింగసూగూరు తాలూకా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరత్న, అధికారి సిద్దప్ప, సింధనూరు రైతు కేంద్రం అధికారి ఇబ్రహీంలు అవినీతిలో భాగస్వాములయ్యారని వెల్లడైన నివేదిక ఆధారంగా వాస్తవాలను గుర్తించి వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
నేడు ఎల్లో జోగప్ప నిన్న అరమనె చిత్రం విడుదల
నేడు ఎల్లో జోగప్ప నిన్న అరమనె చిత్రం విడుదల
నేడు ఎల్లో జోగప్ప నిన్న అరమనె చిత్రం విడుదల
Comments
Please login to add a commentAdd a comment