రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాదజోషిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ గతంలో అనేక మార్లు సీఎం సిద్దరామయ్య, ప్రధాని మోదీకి వినతిపత్రాలు అందించామన్నారు. మరోసారి ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.
బాలికపై కుక్కల గుంపు దాడి
రాయచూరురూరల్: బాలికపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈఘటన రాయచూరు తాలూకా మర్చటాల్ గ్రామంలో జరిగింది. చైత్ర అనే తొమ్మిదేళ్ల బాలిక శనివారం ఉదయం తన ఇంటి వద్ద అడుకుంటుండగా కుక్కల గుంపు చుట్టుముట్టింది. బాలిక కేకలు వేస్తూ తప్పించుకునేందుకు యత్నించగా కుక్కలు వెంటాడి కరిచాయి. దీంతో బాలక ఒంటిపై పది చోట్ల గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు బాలికను రిమ్స్‌కు తరలించారు. కాగా కుక్కల బెడదను నివారించాలని గ్రామ పంచాయతీ అధికారులకు సూచించినా స్పందన లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి
రాయచూరు రూరల్: జిల్లాలోని తుంగభద్ర–కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణపై జిల్లా కలెక్టర్ నిఘా ఉంచాలని జన సంగ్రామ పరిషత్ అధ్యక్షుడు రాఘవేంద్ర కుిష్టిగి డిమాండ్ చేశారు. శనివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రాజకీయ నాయకుల అనుచరులు ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. తవ్వకాలకు కొంత అనుమతి పొంది ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలు చేపడుతున్నారని, ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందన్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాపై కొరడా ఝుళిపించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ చార్జీల పెంపు అన్యాయం
రాయచూరురూరల్: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐఎం లిబరేషన్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద అందోళన చేపట్టారు. జిల్లాధ్యక్షుడు అజీజ్ జాగిర్దార్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థల సిబ్బంది వేతనాల కోసం చార్జీలు పెంచడం దారుణమన్నరు. యూనిట్‌కు 36 పైసలు పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారం పడుతుందన్నారు. పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అంజినేయ, రవిచంద్ర, హనీఫ్, జిలాని, మహేంద్ర, అనంద్ పాల్గొన్నారు.
నీటి ఎద్దడి తలెత్తనివ్వం
రాయచూరు రూరల్: కృష్ణానది తీర ప్రాంత గ్రామాల ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారం పాండ్వే అన్నారు. శనివారం ఆయన గుర్జాపూర్ అనకట్టను పరిశీలించారు. కృష్ణా నది నుంచి పంప్ సెట్ల ద్వారా గ్రామాలకు నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. మంచినీటి పథకాలకు మరమ్మతులు చేపట్టి నీటిని సరఫరా చేస్తామని తెలిపారు.
ఎయిమ్స్ ఏర్పాటుకు వినతి
ఎయిమ్స్ ఏర్పాటుకు వినతి
ఎయిమ్స్ ఏర్పాటుకు వినతి


