
ఆకట్టుకున్న బయలాట ప్రదర్శన
బళ్లారి అర్బన్: అభినయ కళా కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సిరిగుప్ప తాలూకా బూదిగుప్ప గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామీణ కళా సౌరభ కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమాన్ని వీఎస్‌ఎస్‌ఎన్ అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. కన్నడ సాంస్కృతిక శాఖ గ్రామీణ ప్రాంతంలో బయలాట కళకు ప్రోత్సహం అందించడం హర్షనీయమన్నారు. శ్రీ బసవేశ్వర రంగసజ్జ యజమాని విశ్వనాథ్ సౌకర వేదికను అద్భుతంగా తీర్చిదిద్దారు. సిడిగినమళే బలే సిద్దప్ప, రచించిన వీరఅభిమన్యు నాటకంలో కృష్ణార్జునల ఘట్టాలను కళాకారులు చక్కగా ప్రదర్శించారు. కళా కేంద్ర అధ్యక్షుడు సీనియర్ కళాకారుడు కే.జగదీశ్, సీనియర్ కళాకారులు ఈరప్ప సౌకర, రంగరెడ్డి మేస్టారు, ఎర్రిస్వామి మేస్టారు, వందవాగలి సిద్దప్ప, కవి సోమశేఖర్ పాల్గొన్నారు. జీవన్, చక్రవర్తి, హులూరు రమేష్, దొడ్డ హనుమంతలు తమ పాత్రలలో ప్రతిభ చాటి ప్రేక్షకుల మన్నన పొందారు. సీనియర్ సంగీత కళాకారుడు వీరాపుర రంగారెడ్డి, సిద్దప్ప, బూదిగుప్ప ఎర్రిస్వామి, ఆర్మోనియంతో తమదైన శైలిలో బైలాటను రక్తికట్టించారు. బసవరాజ్ తబళ, చిక్కన్న తదితరులు ఇతర సహయ సహకారాలు అందించారు.

ఆకట్టుకున్న బయలాట ప్రదర్శన