లోక్‌సభలో ఎంపీలకు మాట్లాడే హక్కు లేదా?
రాయచూరు రూరల్: లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ లోక్‌సభ సభ్యులకు మాట్లాడే హక్కు లేదా? అని రాయచూరు లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్ ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు మాట్లాడానికి వీలు లేకుండా స్పీకర్లకు మైక్ కట్ చేయడాన్ని ఖండించారు. బడె్‌జ్‌ట్ పద్దులపై ప్రతిపక్ష నేతలు ప్రసంగించడానికి మైక్రో ఫోన్లు అవకాశం కల్పించక పోవడంతో త్వరలో న్యూఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నట్లు నాయక్ తెలిపారు. రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు చేయాలని బీజేపీ ఎంపీ మంజునాథ్ మద్దతు ఇవ్వడంపై అభినందనలు తెలిపారు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, శాసన సభ్యుడు బసన గౌడ, జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, సభ్యులు అమరే గౌడ, శాంతప్ప, శివమూర్తి, జయన్నలున్నారు.


