భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు
సాక్షి,బళ్లారి: నెల రోజుల పాటు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేపట్టి పవిత్రంగా రంజాన్ ఆచరించిన ముస్లిం సోదరులు తమ ఉపవాస దీక్షలు విరమించారు. సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా నెల రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఆచరించిన ఉపవాసాన్ని విరమించి రంజాన్ పండుగను జరుపుకున్నారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ముస్లిం సోదరులు ఇంటింటా ప్రతి ఒక్కరు కొత్త బట్టలు ధరించి మహిళలు ఇంట్లోనే ప్రార్థనలు చేయగా, పురుషులందరూ చిన్నా, పెద్దా, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన మసీదుల్లో ప్రార్థనలు చేశారు. నగరంలో ప్రముఖంగా ఈద్గా మైదానంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు చేరి సామూహిక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత గురువు ముస్లిం సోదరులతో సామూహిక ప్రార్థనలు చేయించి ఉపవాస దీక్షలు విరమింపజేశారు. పవిత్ర రంజాన్ వేళ వేలాది మంది ముస్లిం సోదరులు ఒకే చోట చేరిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆయా మసీదుల వద్దకు చేరుకుని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలో ప్రముఖ ఈద్గా మైదానం వద్దకు చేరుకుని లోక్‌సభ సభ్యుడు తుకారాం, రాజ్యసభ సభ్యుడు నాసిర్ హుస్సేన్, నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి తదితరులు ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఘనంగా రంజాన్ పండుగ
హొసపేటె: రంజాన్ పండుగ వేడుకలు సోమవారం ముస్లిం సోదరులు విజయనగర జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆర్టీఓ కార్యాలయం వెనుక ఉన్న ఈద్గా మైదానంలో ఉదయం 7.30 గంటలకు, కేఆర్‌టీసీ బస్ డిపో సమీపంలోని కొత్త ఈద్గా మైదానంలో ఉదయం 8.30 గంటలకు, చిత్తవాడిగి, కారిగనూరు ఈద్గా మైదానాల్లో ఉదయం 9 గంటలకు, నాగేనహళ్లి ఈద్గా మైదానంలో ఉదయం 9.30 గంటలకు, టీబీ డ్యాం ఈద్గా మైదానంలో ఉదయం 10 గంటలకు సామూహిక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. ప్రతిచోటా శాంతియుత సామూహిక ప్రార్థనలు జరిగాయి. ముందుగా ఊరేగింపులో నడిచిన వ్యక్తులు ఒకరినొకరు పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. బంధువులు, స్నేహితులను ఇంటికి ఆహ్వానించి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం కూడా ఒక సాధారణ దృశ్యం. కొత్త బట్టలు ధరించి మండుతున్న ఎండలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులను కలిసి సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు
ఎట్టకేలకు పవిత్ర ఉపవాస దీక్షల విరమణ
ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు
రాయచూరు రూరల్: ముస్లిం సోదరులు ఈద్గా మైదానంలో సోమవారం ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. అత్యంత భక్తిశ్రద్ధలతో నమాజ్ చేశారు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు మాట్లాడుతూ జిల్లాలో హిందూ, ముస్లింలు అన్నదమ్ములుగా ఉన్నామన్నారు. మనమంతా ఒక్కటే అనే భావాలను చాటడానికి రంజాన్ పండుగ చేసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, రవి, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌లున్నారు. మాన్విలో శాసన సభ్యుడు హంపయ్య నాయక్, తలమారిలో గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు
భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు


