హొసపేటె: విజయనగర డీఏఆర్ ఆర్‌పీఐ జి.శశికుమార్, హొసపేటె రూరల్ పోలీస్ స్టేషన్ పీఎస్‌ఐ హెచ్.నాగరత్న, కూడ్లిగి తాలూకాలోని గుడెకోటె పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కొట్రేష్ చిమ్మల్లి ముఖ్యమంత్రి పతకాలకు ఎంపికయ్యారు. 2024వ సంవత్సరానికి ముఖ్యమంత్రి పతకాల జాబితా ప్రకటించగా జిల్లా నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. విజయనగర జిల్లా సాయుధ రిజర్వ్ ఫోర్స్‌కు చెందిన డీఏఆర్ ఆర్పీఐగా ఉన్న శశికుమార్ ఇటీవలే చిత్రదుర్గకు బదిలీ అయ్యారు.
భద్రా నుంచి తుంగభద్రకు 2 టీఎంసీల నీరు
● ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటన
హొసపేటె: తాగునీటి అవసరాల కోసం భద్రా డ్యాం నుంచి తుంగభద్ర డ్యాంకు రెండు టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఏప్రిల్ 1, 5వ తేదీల మధ్య కాలువలోకి నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం నిర్ణయించారు. దీని వల్ల కళ్యాణ కర్ణాటకలోని కొప్పళ, రాయచూరు, యాదగిరి తదితర జిల్లాల్లో పండించే పంటలకు, ఇక్కడి ప్రజలకు తాగునీటి లభ్యత లభిస్తుంది. మార్చి 30 నాటికి భద్ర జలాశయంలో 28 టీఎంసీల నీటి నిల్వ అందుబాటులో ఉంది. ఇందులో మే 8 వరకు 11 టీఎంసీలు సాగునీటికి, 14 టీఎంసీలు తాగునీటికి అవసరం కాగా, 3 టీఎంసీల నీటిని జలాశయంలో నిలుపుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 6 నుంచి కాలువలను తాగునీటి సరఫరాకు మాత్రమే ఉపయోగిస్తారు. రైతుల పంటలకు తాగునీరు అందించడానికి ప్రభుత్వం అన్ని స్థాయిల్లో కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
యత్నాళ్‌తో కాంగ్రెస్ నేత భేటీపై సర్వత్రా చర్చ
హుబ్లీ: బీజేపీ నుంచి బహిష్కృతుడైన విజయపుర ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ కాంగ్రెస్‌లో చేరుతారు. కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందింది అన్న చర్చలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ కాంగ్రెస్ నేత యత్నాళ్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ధార్వాడ గ్రామీణ శాఖ, జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ పాటిల్ సోమవారం ప్రైవేట్ హోటల్‌లో యత్నాళ్‌ను కలవడంతో తమ పార్టీలోకి ఆహ్వానించారా? అన్న విషయంపై స్పష్టత రాకున్న తీవ్రంగా చర్చకు దారి తీసింది. దీన్ని యత్నాళ్ కూడా తోసిపుచ్చినా దానికి దోహద పడేలా కాంగ్రెస్ నుంచి ప్రముఖుడు కలవడం కుతుహలం రేకెత్తిస్తోంది. బెంగళూరు నుంచి మార్గమధ్యంలో హుబ్లీకి వచ్చిన యత్నాళ్‌ను అనిల్‌కుమార్ కలిసి కొద్దిసేపు హోటల్‌లో చర్చించడం కాకతాళీయమా? లేక పనిగట్టుకొని కలిశారా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
శ్రీశైలం భక్తులకు అన్నదానం
రాయచూరు రూరల్ : శ్రీశైల మల్లికార్జునుని దర్శనార్థం బయలుదేరి వచ్చిన కళ్యాణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక ప్రజలు భక్తులకు ఉచిత భోజనం అందించారు. సోమవారం బైపాస్ రహదారిలోని ముగుళకోడ ముక్తి మందిర మైదానంలో వీరశైవ సమాజం, బసవ సమితి ఆధ్వర్యంలో శాంతమల్ల శివాచార్యులు, చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు భక్తులకు భోజనం వడ్డించారు. లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, వీరశైవ సమాజం అధ్యక్షుడు చంద్రశేఖర్ పాటిల్, అమరేగౌడ, జయన్న, కరియప్ప, శాంతప్ప, శివమూర్తి, జయంతిరావ్ పతంగిలున్నారు.
స్వయంకృషితో ఎదగాలి
రాయచూరు రూరల్ : విద్యార్థులు స్వయంకృషితో ముందుకు రావాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ అన్నారు. సోమవారం హరిజనవాడ ఆవరణలో నవరత్న యువక సంఘం తరఫున విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు మానసికంగా, ఆర్థికంగా, సాంఘీకంగా అభివృద్ధి చెందడానికి వీలుంటుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, రవీంద్ర జాలదార్, విరుపాక్షి, నరసింహులు, మల్లేశప్ప, నాగరాజ్, శరణప్ప, ప్రతిభారెడ్డి, తిమ్మయ్య, తిమ్మప్ప, అంబణ్ణ, జనార్దన్, అనిల్‌కుమార్‌లున్నారు.
ముగ్గురు పోలీసులకు ముఖ్యమంత్రి పతకం


