రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా
రాయచూరు రూరల్: కేంద్ర ప్రభఽుత్వం బీఎస్‌ఎన్‌ఎల్ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సవరించిన పెన్షన్‌ను పరిశీలించాలని కోరుతూ పదవీ విరమణ చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గురువారం బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు బసవరాజ్ మాట్లాడారు. ప్రభుత్వం 1972 నుంచి అమలులో ఉన్న పెన్షన్‌ను సవరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో కర్లి, ఆదెప్ప, సోమనరెడ్డి, సిద్దప్ప, గురురాజరావ్, ఉక్కలి, లాలప్పలున్నారు.
రిమ్స్‌లో అన్ని సౌకర్యాలు సిద్ధం
రాయచూరు రూరల్ : రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో రోగులకు అన్ని సౌకర్యాలు సిద్ధం చేసినట్లు జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. గురువారం ఆస్పత్రిని తనిఖీ చేసిన అనంతరం వైద్యులతో మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి అధికంగా వచ్చే రోగులందరికీ సమానంగా వైద్యం అందిస్తారన్నారు. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలతో కూడిన వైద్య పద్ధతులను ఏర్పాటు చేశామన్నారు. చిన్న పిల్లల చికిత్స కోసం ప్రత్యేకంగా 20 పడకలను పెంచాలన్నారు. రోగులకు ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించాలన్నారు. రిమ్స్ వైద్యాధికారి డాక్టర్ రమేష్, విజయ శంకర్, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ఆర్‌సీహెచ్ అధికారిణి నందిత, భాస్కర్, టీహెచ్‌ఓ ప్రజ్వల్ కుమార్‌లున్నారు.
సమస్యలు తీర్చాలని ధర్నా
రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా గోర్కకల్ పంచాయతీ పరిధిలోని గవిగట్టలో నెలకొన్న సమస్యలపై గ్రామ పంచాయతీ అధికారులు స్పందించడం లేదని రైతు సంఘం జిల్లా సంచాలకురాలు అనిత ఆరోపించారు. బుధవారం రాత్రి పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. గ్రామంలో గత 15 రోజుల నుంచి తాగునీరు, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా


