రాయచూరు రూరల్: నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్‌ఆర్‌బీసీ) ఆయకట్టు చివరి భూములకు నీరందక పోవడంతో రైతులు బిక్కముఖం వేసుకున్నారు. మూడు జిల్లాల్లో లక్షలాది హెక్టార్లలో పంట నష్టం సంభవించే అవకాశాలున్నాయి. నీటి గేజ్ నిర్వహణ సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు పాటించడం లేదు. అధికారులు ఆయకట్టు చివరి భూములకు నీరందించక పోవడంతో పంటలు వాడుముఖం పట్టాయి.
పంట నష్టం వివరాలు:
యాదగిరి జిల్లాలో శహాపుర, సురపుర, హుణసిగి, వడగేర, నారాయణపుర, రాయచూరు జిల్లాలోని లింగసూగూరు, దేవదుర్గ, రాయచూరు ప్రాంతాల్లో వరి, మిరప, సజ్జ పంటలు పండిస్తున్నారు. యాదగరి జిల్లాలో దాదాపు రెండు లక్షలు, రాయచూరు జిల్లాలో లక్ష, విజయపుర జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో వరి, సజ్జ, మిరప పంటలను పండిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు రోజుకు 3500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే పంటలు చేతికొచ్చే అవకాశం ఉండేది. కాలువకు నీటి సామర్థ్యం, గేజ్ నిర్వహణ చేయడంలో అధికారుల నిర్లక్ష్యంతో పంటలు చేతికొచ్చే సమయంలో నీటి లభ్యత కరువైంది. ఆల్మట్టి జలాఽశయం నుంచి నారాయణ పుర డ్యాంకు ఆరు టీఎంసీల నీటిని విడుదల చేస్తే రైతులు కష్టాల నుంచి గట్టెక్కుతారు.
సుమారు ఆరు లక్షల హెక్టార్లలో
పంట నష్టం
రాయచూరు, యాదగిరి జిల్లాల్లో
రైతులు విలవిల
ఏప్రిల్ 20 వరకు నీరు వదలాలి
ఎండుతున్న పంటలను చూసైనా అధికారులు ఎన్‌ఆర్‌బీసీ చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీటిని విడుదల చేయాలి
–కరెమ్మ నాయక్, ఎమ్మెల్యే, దేవదుర్గ
ఏప్రిల్ నెలాఖరు వరకు నీరివ్వాలి
నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్‌ఆర్‌బీసీ) ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందించాలి
– రాజుగౌడ, మాజీ మంత్రి
అందని నీరు.. ఎండిన పైరు
అందని నీరు.. ఎండిన పైరు
అందని నీరు.. ఎండిన పైరు


