గ్యారెంటీలతో ఖజానా లూటీ
రాయచూరు రూరల్: కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ధరల పెంపుతో వచ్చే ఆదాయాన్ని పంచ గ్యారెంటీల పేరుతో ప్రజలకు ఉచితంగా ఇవ్వడం ద్వారా ఖజానాను లూటీ చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరనగౌడ ఆరోపించారు. శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లును యూనిట్‌కు 36 పైసలు, పాల ధర లీటరుకు రూ.9, బస్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ ధరలు పెంచండం తగదన్నారు. పాల రైతులకు రూ.662 కోట్ల బకాయిలున్నట్లు తెలిపారు. జాతీయ కాంగ్రెస్‌కు కర్ణాటక సర్కార్ ఏటీఎంగా మారిందన్నారు. పంచ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మంత్రులు, శాసన సభ్యులు దిగజార్చారని విమర్శించారు. పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో నగర అధ్యక్షుడు రాఘవేంద్ర, సభ్యులు శంకరరెడ్డి, నాగరాజ్, చంద్రశేఖర్, మల్లికార్జునలున్నారు.


