నేటి నుంచి బీజేపీ జనాక్రోశ యాత్ర
శివాజీనగర: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు సోమవారం నుంచి ప్రజావేశ యాత్రను జరుపనున్నారు. ఆదివారం బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో పార్టీ సంస్థాపనా దినోత్సవంలో రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర మాట్లాడుతూ ఈ మేరకు తెలిపారు. మైసూరులో నాడదేవత చాముండేశ్వరి దేవికి పూజలు చేసి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జనాక్రోశ యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. అన్ని జిల్లాల్లో కూడా యాత్ర జరుగుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులకు అధికార మదం ఎక్కువై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్త వినయ్ సోమణ్ణది ఆత్మహత్య కాదు హత్య, సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు.
రాష్ట్రంలో పర్యటిస్తా: యడ్డి
బీజేపీ నాకు అన్నింటినీ ఇచ్చిందని, మునుముందు పార్టీ బలోపేతానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని మాజీ సీఎం యడియూరప్ప చెప్పారు. ఆయన మాట్లాడుతూ ఏ వనరులు లేని రోజుల్లో ఊరూరా తిరిగి బీజేపీని బలోపేతం చేశానని చెప్పారు. ఎన్నో గెలుపు ఓటములను చూశామని, ఏనాడు నమ్మిన ధైర్యం, సిద్ధాంతాన్ని విడచిపెట్టలేదని అన్నారు.
విజయేంద్ర వెల్లడి


