జగదభిరాముడు శ్రీరాముడే
మండ్య/ తుమకూరు: సుందర రామా.. సుగుణభిరామా, సుగుణధామ సూర్యామయ సోమా.. అని భక్తి తన్మయత్వంలో ప్రజలు శ్రీరామనవమిని ఆచరించారు. రాజధానితో పాటు రాష్ట్రంలో అన్నిచోట్లా భక్తిరసం పొంగిపొర్లింది. శ్రీరాముడు జన్మదినోత్సవమైన నవమిని పలుచోట్ల మరింత వినూత్నంగా జరిపారు. బెంగళూరులో రామాంజనేయ ఆలయం నుంచి పిల్లలు, పెద్దలు మనోహరంగా నృత్యం చేస్తూ శోభాయాత్ర సాగించారు. మండ్య నగరంతో పాటు జిల్లాలో రామ, హనుమ ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. నెహ్రు నగరలో ఉన్న రామమందిరంలో రాముల వారికి ప్రత్యేక అలంకారం, అర్చనలు జరిపారు. భక్తులకు పానకం, ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఓళిగల నైవేద్యం
తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకాలోని హులియూరు వద్ద లింగప్పనపాళ్యలో నవమి వేడుకలు కోలాహలంగా సాగాయి. రాముల దేవాలయం నుంచి స్వామివారి ఊరేగింపును నిర్వహించారు. ఓళిగలు చేసుకుని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఇక బెళగావిలో హిందూ సంఘాలు భారీ ఆర్భాటంగా ఊరేగింపులు చేశారు. నవమి సందర్భంగా చిక్కమగళూరులో ఎద్దులబండ్ల పందేలు అలరించాయి.
వాడవాడలా శ్రీరామ నవమి వేడుకలు
అట్టహాసంగా శోభాయాత్రలు
జగదభిరాముడు శ్రీరాముడే
జగదభిరాముడు శ్రీరాముడే
జగదభిరాముడు శ్రీరాముడే
జగదభిరాముడు శ్రీరాముడే


