పండ్లకు రారాజు, మామిడి పండ్లు అనగానే నోట్లో నీళ్లూరడం స
బెంగళూరు జయమహల్ రోడ్డులో మామిడి స్టాల్ (ఫైల్)
సాక్షి బెంగళూరు: ఎండాకాలం రాగానే మామిడి పండ్లు తినొచ్చనే ఆశ అందరిలోనూ ఉంటుంది. కానీ ఈ దఫా ఆశ ఇంకా తీరేలా లేదు. మామూలుగా మొదట రామనగర మామిడి, ఆపై కోలారు జిల్లా మామిడి కాయలు, పండ్లు మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. రాష్ట్రంలో ఈ ఏడాది మామిడి దిగుబడి భారీగా క్షీణించినట్లు అంచనా. ఎంత అంటే 30 నుంచి 50 శాతం వరకూ పడిపోయింది. మార్కెట్లో లభిస్తున్న కొద్దిపాటి పండ్లు కూడా పొరుగున ఏపీ నుంచి వస్తున్నాయి. 15– 20 రోజుల్లో కన్నడనాడు తోటల మామిడి పండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మార్చి నుంచే రావాలి మరి
సాధారణంగా మార్చి నెల ప్రారంభం కాగానే రాష్ట్రంలో మొదటి మామిడి (రామనగర జిల్లా మామిడి) మార్కెట్లో లభ్యం అవుతుంది. అయితే పలు కారణాల వల్ల తోటల్లో పూత, పండ్లు దిగుబడి బాగా తగ్గిపోయింది. కొన్నిచోట్ల మామిడి పండ్ల కోతకు రైతులు సిద్ధమవుతున్నారు. రామనగర నుంచి ఈ ఏడాది సుమారు 1.65 లక్షల టన్నుల మామిడి దిగుబడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రామనగర జిల్లా నుంచి సింధూర, రసపురి, మల్లిక, బాదామి, తోతాపురి, మలగూబా, నీలం జాతుల మామిడి ఏప్రిల్ నుంచి జూలై వరకు నోళ్లను తీపి చేస్తాయి. ఇక కోలారు జిల్లా మామిడి పండ్లు జూన్ నుంచి ఆగస్టు వరకు విపణిలో ఉంటాయి. కోలారు నుంచి ఎక్కువగా సింగపూర్, అరబ్ దేశాలకు ఎగుమతి అవుతాయి.
కొప్పళ మామిడి ప్రత్యేకం
మామిడి పండ్లలో విశిష్ట జాతికి చెందిన మామిడిని కొప్పళ జిల్లాలో సాగు చేస్తున్నారు. కేసర్, బాదమి, రత్నగిరి జాతుల పండ్లు నోరూరిస్తాయి. వాటిని సాగుదారులు అధిక ధరకు ఇతర రాష్ట్రాల వ్యాపారులకు అమ్మేస్తారు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.
వేచి చూడాలి
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి బాగా తగ్గిపోయింది. మండుటెండలే కారణమని రైతులు, హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు మామిడిని తెప్పిస్తున్నందున సహజంగానే రవాణా చార్జీలు , ఇతర పన్నులు కలిపి ధరలు చుర్రుమంటున్నాయి. స్థానిక మామిడి పండ్లు వస్తే ధరలు దిగిరావచ్చు. అందుకు కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.
రాష్ట్రంలో ఇంకా మార్కెట్లోకి రాని పండ్లు
మ్యాంగో ప్రియుల్లో అసహనం
మరో 15–20 రోజులు తప్పదు!
బాగా క్షీణించిన దిగుబడి
పండ్లకు రారాజు, మామిడి పండ్లు అనగానే నోట్లో నీళ్లూరడం స
పండ్లకు రారాజు, మామిడి పండ్లు అనగానే నోట్లో నీళ్లూరడం స
పండ్లకు రారాజు, మామిడి పండ్లు అనగానే నోట్లో నీళ్లూరడం స


