పౌర కార్మికుల సేవలు రెగ్యులర్
శివాజీనగర: తాత్కాలిక విధానంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల ఉద్యోగాలను రెగ్యులర్ చేయనున్నట్లు సీఎం సిద్దరామయ్య చెప్పారు. సోమవారం ప్యాలెస్ మైదానంలో పౌరకార్మికుల మహా సంఘం 25వ వార్షికోత్సవం జరిగింది. సీఎం పాల్గొని మాట్లాడుతూ మే నెల ఒకటిన కార్మిక దినోత్సవమని, ఆ రోజున ఉద్యోగాల క్రమబద్ధీకరణ ఆదేశాలను ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. మీరు బసవణ్ణ వచనం ప్రకారం కాయకవే కై లాస అని శ్రమిస్తున్నారని, మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. తనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా, పౌర కార్మికులు అయినా ఎలాంటి వ్యత్యాసం లేదు. అందరి సేవలు కూడా పవిత్రమే అన్నారు. ఎవరూ మీతో కించపరిచేలా నడచుకోరాదన్నారు. పారిశుధ్య కార్మిక సముదాయానికి ఉచిత వైద్యసేవల కార్డు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా పౌర కార్మికులు పాల్గొన్నారు.
పౌర కార్మికుల సేవలు రెగ్యులర్


