లాభాల బాటలో ఆర్డీసీసీ బ్యాంక్
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా కేంద్ర సహకార(ఆర్డీసీసీ) బ్యాంక్‌కు 2024–25వ ఆర్థిక సంవత్సరంలో రూ.12.11 కోట్ల మేర లాభాలు వచ్చినట్లు బ్యాంక్ అధ్యక్షుడు విశ్వనాథ్ పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని లావాదేవీల నుంచి రూ.రూ.23.84 కోట్ల మేర లావాదేవీలు జరగగా రూ.11.73 కోట్లు వ్యయం చేయగా రూ.12.11 కోట్లు లాభం గడించామన్నారు. 574 సంఘాలు, షేర్ క్యాపిటల్ రూ.51.52 కోట్లు, డిపాజిట్లు రూ.1381 కోట్లు ఉండగా, నాబార్డ్, అపెక్స్ బ్యాంకుల నుంచి రూ.119.93 కోట్ల రుణాలు తీసుకున్నామన్నారు. 2025 మార్చి నాటికి బ్యాంక్ నుంచి రూ.1023.20 కోట్ల రుణాలిచ్చామన్నారు. గతంలో ఇచ్చిన రూ.1031.63 కోట్ల రుణాల్లో మార్చి నాటికి రూ.974.67 కోట్లు వసూలు చేశామన్నారు. బ్యాంక్‌లో రుణాలు పొంది మరణించిన రైతులకు రూ.50 వేల చొప్పున 262 మందికి మాఫీ చేశామన్నారు. డైరెక్టర్ విజయ్ కుమార్, సీఈఓ మల్లికార్జునలున్నారు.


