ఉద్యోగులకు క్రీడా పోటీలు అవసరం
హొసపేటె: ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు ఎంతో అవసరమని విజయనగర జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆయన బుధవారం క్రీడా జ్యోతిని వెలిగించి, క్రీడా జెండాను ఎగురవేసి, జెండా వందనాన్ని స్వీకరించి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు క్రీడా పోటీలను మండుటెండల్లో జాగ్రత్తగా ఆడాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో క్రీడలకు అత్యుత్తమ స్థానం ఇవ్వాలని అన్నారు. ఉద్యోగులు క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా శారీరక ఎదుగుదలతో పాటు మానసికంగా పని ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు వీలవుతుందన్నారు. అనంతరం ఉద్యోగులకు పరుగు పందెం, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర పోటీలు నిర్వహించారు. జెడ్పీ సీఈఓ నోంగ్జాయ్ మహమ్మద్ అలీ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.మల్లికార్జునగౌడ, రాష్ట్ర పరిషత్ సభ్యుడు రాఘవేంద్ర, జిల్లా కోశాధికారి కే.మల్లేశప్ప పాల్గొన్నారు.
మజ్జిగ పంపిణీ కేంద్రం ప్రారంభం
రాయచూరు రూరల్ : నగరంలో పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని గురువారం వెనుక బడిన వర్గాల విభాగం అధ్యక్షుడు శాంతప్ప ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలోని అంబిగర చౌడయ్య సర్కిల్‌లో మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించడం అబినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అధికంగా ప్రజలు వస్తుంటారన్నారు. వేసవిలో చల్లని మజ్జిగను అందించడానికి చేస్తున్న సేవలు మరువరానివన్నారు. కార్యక్రమంలో గోవిందరాజ్, వెంకటేష్, సూర్యనారాయణ, మునిచంద్ర, నాగరాజ, కాంచాణం, రాధమ్మ, గాయత్రి, నరసింహులు, వనజాక్షి, సరళ, పార్వతమ్మలున్నారు.
అంబులెన్స్ సేవకు శ్రీకారం
రాయచూరు రూరల్ : మానవుడు ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని ఉప్పారవాడిలో సేవా ట్రస్ట్, విస్తార ఫైనాన్స్, బాలంకు ఆస్పత్రి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబులెన్సు సేవను ప్రారంభించి మాట్లాడారు. ఆదివారం జరగనున్న మెగా ఆరోగ్య ఉచిత శిబిరాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాజీ శాసన సభ్యుడు బసనగౌడ, నాగరాజ్, బి.వినాయక్, బండేష్‌లున్నారు.
దళితులపై దాడి జరిగినా పట్టదా?
రాయచూరు రూరల్ : యాదగిరి జిల్లాలో దళితులపై దాడులు జరిగినా పోలీసులు కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించడం తగదని దళిత సంఘర్ష సమితి అధ్యక్షుడు హనుమంతప్ప ఆరోపించారు. గురువారం సురపుర డీఎస్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. యాదగిరి జిల్లా సురపురలో 15 రోజుల క్రితం అగ్రవర్ణాల వారు దళితులపై దాడులు చేశారన్నారు. తమకు రక్షణ కల్పించాలని విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి దళితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
మానవత్వమే శ్రేష్ట ధర్మం
హుబ్లీ: సద్గురు సంస్థ భావోసాహేబా మహారాజుల బ్రహ్మశాలలో జరిగిన జ్ఞానయజ్ఞ సప్తాహం రెండో రోజు కార్యక్రమంలో డాక్టర్ శివకుమార స్వామి సాన్నిధ్యం వహించి మాట్లాడారు. జిల్లాలోని అణ్ణిగేరి అమృతేశ్వర ఆలయంలో ఆయన మాట్లాడుతూ మానవత అన్నిటి కన్నా శ్రేష్టమైన ధర్మం అన్నారు. శివమొగ్గ కగ్గ నటేశ, సిద్దన్న సిరసంగి తత్వపదాలను పాడి భక్తిసంద్రంలో ఓలలాడించారు. వివిధ రంగాల్లో కృషి చేసిన సాంబయ్య హిరేమఠ కుటుంబానికి గిరివరదశ్రీ ప్రశస్తిని ప్రదానం చేసి సన్మానించారు. అంతకు ముందు ముత్తైదువులకు ఒడినింపారు. ప్రముఖ వీధుల్లో ప్రదర్శన కూడా నిర్వహించారు. కార్యక్రమంలో వరదశ్రీ ఫౌండేషన్ మల్లికార్జున, ఈరణ్ణ, మహేష్, వీరేష్ పాల్గొన్నారు.
ఉద్యోగులకు క్రీడా పోటీలు అవసరం
ఉద్యోగులకు క్రీడా పోటీలు అవసరం
ఉద్యోగులకు క్రీడా పోటీలు అవసరం


