మంత్రి గారూ.. న్యాయం చేయండి
చింతామణి: ప్రభుత్వ పాఠశాలలో టీచరమ్మ బెత్తంతో కొట్టడంతో తమ కొడుకు కంటిచూపు పోయిందని, కారకులపై చర్యలు తీసుకొని మంత్రి సుధాకర్ న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు. తాలూకాలోని ఎగువకోట గ్రామంలో రెండవ తరగతి చదువుతున్న యశ్వంత్ అనే బాలున్ని ఉపాధ్యాయురాలు కట్టెతో కొట్టడంతో తలలో నరాలు దెబ్బతిని కంటి చూపు పోవడం తెలిసిందే. ఈ ఘటన రాజకీయంగానూ వేడెక్కిస్తోంది. బాలునికి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేయగా ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకొంటున్నారని జిల్లా మంత్రి సుధాకర్ చెప్పడం బాధాకరమని తల్లిదండ్రులు అంజలి, నటరాజ్ ఆవేదన చెందారు. మంత్రి ఒక తండ్రి మాదిరిగా తమ బిడ్డకు న్యాయం చేయాలని కోరారు.
కళ్లుపోయిన చిన్నారి కన్నవారి మొర


