కారు ఢీకొని బైక్‌ చోదకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని బైక్‌ చోదకుడు మృతి

Apr 14 2025 1:56 AM | Updated on Apr 14 2025 1:58 AM

హొసపేటె: జాతీయ రహదారి– 50లోని విరుపాపుర గ్రామం సమీపంలో శనివారం సాయంత్రం అతి వేగంగా వస్తున్న కార్‌ అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌ చోదకుడు స్థలంలోనే మృతి చెందిన ఘటన విజయనగర జిల్లా కూడ్లిగిలో జరిగింది. బైక్‌ రైడర్‌ గెద్దలగట్టె నుంచి కూడ్లిగికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు ఢీకొంది. మృతుడిని గెద్దలగట్టెకు చెందిన రాకేష్‌(22) గా పోలీసులు గుర్తించారు. పట్టణంలో కొత్త బేకరీని ప్రారంభించిన రాకేష్‌ తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అతను గెద్దలగట్టె నుంచి బైక్‌పై పట్టణానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైవే టోల్‌, పెట్రోలింగ్‌ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ సి.ప్రకాష్‌ సహా పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. మృతుడి తాత సదాశివప్ప ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అక్కడి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

డాక్టర్‌ రాజ్‌కుమార్‌

చిత్రపటానికి పుష్పాంజలి

రాయచూరు రూరల్‌: కన్నడ సినీ నటుడు దివంగత డాక్టర్‌ రాజ్‌కుమార్‌ 19వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అభిమానులు పుష్పాంజలి ఘటించారు. ఆదివారం నగరంలోని డాక్టర్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ట్రస్టు కార్యాలయంలో డాక్టర్‌ రాజ్‌కుమార్‌ చిత్రపటానికి ట్రస్టు అధ్యక్షుడు సాదిక్‌ఖాన్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సభ్యులు బసవరాజ్‌, సంతోష్‌, చేతన సంస్థ సంచాలకుడు సబ్జలీ, నాసిర్‌లున్నారు.

విద్యా రంగంలో రాణించాలి

రాయచూరు రూరల్‌: నేటి ఆధునిక సమాజంలో పోటీకి తగినట్లుగా కళ్యాణ కర్ణాటక భాగంలోని విద్యార్థులు విద్యారంగంలో రాణించాలని లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌ సూచించారు. ఆదివారం సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఎస్‌కేఎస్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసిన జేఈఈ, ఇతర పోటీ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై విద్యార్థులతో ముఖాముఖిగా చర్చించడానికి హరీష్‌వర్మ రావడం గర్వకారణమన్నారు. దక్షిణ భారత విద్యార్థులు ఉత్తర భారత విద్యార్థులతో పోటీని తట్టుకోవడానికి తర్ఫీదు అవసరమన్నారు. యువకులు, విద్యార్థులు కఠిన పరిశ్రమతో చదువుకోవాలని సూచించారు. ఇలాంటి ఉచిత పోటీ శిబిరాలను సద్వినియోగ పరచుకోవాలన్నారు. సమావేశంలో బాబురావ్‌ శేగుణశి, నీలమణి శ్రీవాస్తవ్‌లున్నారు.

మెగా వైద్య పరీక్ష శిబిరం

రాయచూరు రూరల్‌: భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) ఆధ్వర్యంలో నగరంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆదివారం మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో భారతీయ వైద్య సంఘం, ఒపెక్‌ ఆస్పత్రి, రిమ్స్‌ కళాశాల పరిశోధన ఆస్పత్రి, నవోదయ ఆస్పత్రి, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చర్మం, చెవులు, ముక్కు, గొంతు, చిన్న పిల్లల వ్యాధులు, గుండెపోటు, బీపీ, షుగర్‌, నేత్ర, ఈసీజీ పరీక్షలను ప్రజలకు ఉచితంగా అందించారు. ఐఎంఏ అధ్యక్షుడు శ్రీశైలేష్‌ అమర్‌ఖేడ్‌, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షక్షేమ శాఖాధికారి సురేంద్రబాబు, మనోహర్‌ పత్తార్‌, వైద్యులు దీపశ్రీ, రాఘవేంద్ర, శ్రీధర్‌ వైట్ల, నీలోఫర్‌, వీరనగౌడలున్నారు.

కారు ఢీకొని  బైక్‌ చోదకుడు మృతి 1
1/1

కారు ఢీకొని బైక్‌ చోదకుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement