వలస కూలీల వల్లనే నేరాలు
హుబ్లీ: హుబ్లీ నగరంలో అశోక్‌నగర ఠాణా పరిధిలోని అధ్యాపక నగరిలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను అపహరించి, ఓ పాడుబడిన ఇంట్లో అత్యాచారం చేసి ప్రాణాలు తీసిన దారుణ ఉదంతం స్థానికంగానే కాదు రాష్ట్రంలోనూ తీవ్ర దుమారం రేకెత్తించింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన కార్చిచ్చులా ఆగ్రహాన్ని రేకెత్తించింది. వేలాది ప్రజలు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి హంతకున్ని తమకు అప్పగించాలని నిరసనకు దిగారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దిక్కుతోచకుండా చేసింది. ప్రజలు ఇంత రౌద్రరూపం దాల్చుతారని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు కార్యాచరణను ప్రారంభించారు. విచారణకు తీసుకెళ్తుండగా దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు, అందువల్ల కాల్పులు జరిపితే మరణించాడని ప్రకటించారు.
సీసీ కెమెరాలలో దృశ్యాలు
మొదట సీసీ టీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితున్ని కనిపెట్టారు. బిహార్‌కు రితేష్‌కుమార్ (35)గా గుర్తించారు. అతడు మూడు నాలుగు నెలల కిందటే హుబ్లీకి వచ్చి కూలీ పనులు చేస్తున్నాడు. హత్యాచారం ఘటన తరువాత పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా, హంతకుడు బాలికను ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు లభించాయి. దీంతో సాక్ష్యాలు దొరికాయి.
రాళ్లతో దాడి చేసి తప్పించుకునే యత్నం
ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నిందితుడు నివసించే తారిహళలోని అద్దె ఇంటికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. ఈ సమయంలో దుండగుడు రితేష్ పోలీసులపై రాళ్లతో దాడి చేసి పరారు కావడానికి ప్రయత్నించాడు. దీంతో అశోక్ నగర ఎస్‌ఐ అన్నపూర్ణ.. పారిపోవద్దంటూ హెచ్చరిస్తు గాలిలో మూడు రౌండ్లు కాల్చులు జరిపారు. అయిన నిందితుడు ఆగక పోవడంతో రెండు రౌండ్లు పేల్చారు. ఓ తూటా కాళ్లకు, రెండవ తూటాను వెన్ను వద్ద దిగబడ్డాయి. నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కేఎంసీ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. వైద్యులు పరిశీలించి మృతి చెందాడని నిర్ధారించారు. పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ ఘటనాస్థలిని పరిశీలించారు. దుండగుని దాడిలో ఎస్‌ఐ, ఇద్దరు పోలీసులకు స్వల్పగాయాలై ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. బాలిక కుటుంబానికి సర్కారు రూ.10 లక్షల పరిహారం ఇస్తుందని ఎమ్మెల్సీ సలీమ్ అహ్మద్ విలేకరులకు తెలిపారు. ఇల్లు మంజూరు చేస్తామని హుబ్లీ ధార్వాడ తూర్పు ఎమ్మెల్యే ప్రసాద్ అబ్బయ్య తెలిపారు. పలువురు నేతలు చిన్నారి మృతదేహానికి నివాళులర్పించారు.
హుబ్లీలో బాలికపై అత్యాచారం, హత్య
పోలీసు కాల్పుల్లో వలస కూలీ మృతి
నియంత్రణపై త్వరలో సమావేశం
హోంమంత్రి పరమేశ్వర్ వెల్లడి
అమాయక చిన్నారిని చెరబట్టి చిదిమేసి, వాణిజ్యనగరి హుబ్లీలో అల్లరికి కారణమైన వలస కూలీ కథ కొన్ని గంటల్లోనే ముగిసింది. కామాంధుడు పోలీసు తూటాలకు ప్రాణాలు వదిలాడు. దీని వల్ల బాలిక తల్లిదండ్రులకు గర్భశోకం తీరకపోయినా, హంతకునికి శిక్ష పడిందని జనం నిట్టూర్చారు. ఈ ఎన్‌కౌంటర్ అలాంటి ఆలోచన కలిగిన కామాంధులకు గుణపాఠం అవుతుంది.
ఎన్‌కౌంటర్‌పై విచారణ
ఆదివారం హుబ్లీలో బిహార్‌కు చెందిన వ్యక్తి 5 సంవత్సరాల బాలికను ఎత్తుకెళ్లి హత్య చేశాడు. కొంత సమయంలోనే అతనిని అరెస్ట్ చేయడమైనది. స్థలం మహజరుకు నిందితున్ని పిలుచుకొని వెళ్లేటపుడు అతడు పోలీసులపై దాడి చేశాడు. ఆ సమయంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు అని ఎన్‌కౌంటర్ గురించి తెలిపారు. కాల్పులపై ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామని, ఆ తరువాత వాస్తవ సమాచారం తెలుస్తుందని హోంమంత్రి చెప్పారు.
శివాజీనగర: ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి పని, ఉద్యోగం నిమిత్తం వచ్చేవారి ద్వారానే నేరాలు అధికంగా జరుగుతున్నాయని, దీనిని అరికట్టే దిశలో ప్రత్యేక సమావేశం జరుపనున్నట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. హుబ్లీ అమానుష ఘటన నేపథ్యంలో సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలో వలస కార్మికులచే నేరాలు అధికం కావడం ప్రభుత్వం గమనిస్తోంది. వలసదారులకు ఇక్కడి సంస్కృతి, భావాలు అర్థం కావటం లేదేమో అనిపిస్తుంది. భవన నిర్మాణ పనుల కార్మికులు, ఇతరులు ఇటువంటి నేర కార్యకలాపాల్లో పాల్గొనటాన్ని అరికట్టేందుకు కార్మిక శాఖతో ప్రత్యేక సమావేశం జరిపి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పరిశీలిస్తామన్నారు.
వలస కూలీల వల్లనే నేరాలు
వలస కూలీల వల్లనే నేరాలు
వలస కూలీల వల్లనే నేరాలు
వలస కూలీల వల్లనే నేరాలు
వలస కూలీల వల్లనే నేరాలు


