రాజ్యాంగంతో ప్రతి ఒక్కరికీ గౌరవం
కోలారు : దేశంలో ప్రతి వ్యక్తి సమాజంలో గౌరవంగా జీవించడానికి రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ అవకాశం కల్పించారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ 134వ జయంతి వేడుకల్లో ఆయన అంబేడ్కర్ చిత్రపటానికి మాలార్పణ చేసి మాట్లాడారు. సమాజంలోని అన్ని సముదాయాలు ఒక్కటై అంబేడ్కర్ జయంతిని ఆచరించాలన్నారు. మంత్రి కెహెచ్ మునియప్ప సూచనల మేరకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు అన్ని తాలూకా కేంద్రాల్లోని కాంగ్రెస్ కార్యాలయాల్లో అంబేడ్కర్ జయంతిని ఆచరిస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ఇతర దేశాల్లో కూడా మన్నన పొందిందన్నారు. కాంగ్రెస్ జిల్లా కార్యాధ్యక్షుడు ఊరుబాగిలు శ్రీనివాస్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జయదేవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
జేడీఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో..
జేడీఎస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నగరంలో సోమవారం అంబేడ్కర్ జయంతిని ఆచరించారు. ఉదయం నగరంలోని బంగారుపేటె సర్కిల్‌లోని అంబేడ్కర్ ప్రతిమకు మాలార్పణ చేయడం ద్వారా అంబేడ్కర్‌కు నివాళి అర్పించారు. జేడీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు యలువళ్లి నాగరాజ్, హారోహళ్లి నాగరాజ్, జయనగర మునియప్ప, నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగం ఉన్నంత వరకు
అంబేడ్కర్ పేరు చిరస్థాయి
మాలూరు: రాజ్యాంగం ఉన్నంత వరకు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరు దేశంలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని, దేశంలోని ప్రతి ఒక్కరి హృదయాల్లో అంబేడ్కర్ కొలువై ఉన్నారని ఎమ్మెల్యే కేవై నంజేగౌడ తెలిపారు. సోమవారం పట్టణంలోని మహారాజ సర్కిల్‌లో తాలూకా జాతీయ పండుగల ఆచరణ సమితి, సాంఘిక సంక్షేమ శాఖ, దళిత పర సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేడ్కర్ 134వ జయంతిలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్ల ప్రతి ఒక్కరికీ ఏదో విధంగా ప్రయోజనం కలిగిందన్నారు. రాజ్యాంగంలో అన్ని కులాలు, మతాలకు సమాన అవకాశాలను కల్పించారన్నారు. రాజ్యాంగ రచన వల్లనే నేడు ఎంతో మంది సామాన్యులు ఉన్నత స్థానాలకు చేరుకోగలిగారన్నారు. అంబేడ్కర్ నేడు మన మధ్య లేకున్నా ఆయన రచించిన రాజ్యాంగం నేటికీ శాశ్వతంగా నిలిచి ఉందన్నారు. కొంతమంది రాజ్యాంగాన్ని మారుస్తామని పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వారి ఆశలు ఎన్నటికీ నెరవేరవన్నారు. కార్యక్రమంలో వివిధ రంగాల్లో సాధన చేసిన వారిని గుర్తించి సన్మానించారు. కార్యక్రమంలో సాహితీవేత్త కోటిగానహళ్లి రామయ్య. తహసీల్దార్ ఎంవీ రూప, టీపీ ఈఓ కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ జీవితం స్పూర్తిదాయకం
కేజీఎఫ్ : రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని నగరంలో వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రూపా శశిధర్ నగరంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఉన్న అంబేడ్కర్ ప్రతిమకు మాలార్పణ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేడ్కర్ యావత్ ప్రపంచం మెచ్చిన రాజ్యాంగాన్ని భారత దేశానికి అందించారన్నారు. అంబేడ్కర్ స్పూర్తిదాయకమైన జీవితాన్ని గడిపారన్నారు. దేశంలో అంటరానితనంపై అంబేడ్కర్ యుద్ధం ప్రకటించి దానిని రూపుమాపడానికి శ్రమించారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. దేశంలోని పేదలు, దీన, దళితులు, అణగారిన వర్గాలు నేడు స్వాభిమానంతో జీవించడానికి ముఖ్య కారణం అంబేడ్కర్ అన్నారు. అంబేడ్కర్ కేవలం రాజ్యాంగ రచయితగా, కార్మిక మంత్రిగా పని చేసి కార్మికుల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు. రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులను కల్పించారన్నారు. తహసీల్దార్ నాగవేణి, నగరసభ కమిషనర్ పవన్‌కుమార్, నగరాభివృద్ధి ప్రాధికార కమిషనర్ ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ జయంతిలో వక్తలు
రాజ్యాంగ నిర్మాతకు నివాళులు
రాజ్యాంగంతో ప్రతి ఒక్కరికీ గౌరవం
రాజ్యాంగంతో ప్రతి ఒక్కరికీ గౌరవం
రాజ్యాంగంతో ప్రతి ఒక్కరికీ గౌరవం


