హడపద సముదాయంపై వివక్ష తగదు
రాయచూరురూరల్: హడపద సమాజాన్ని అవమానంచిన బ్యాంక్ అధికారులపై చర్యలు చేపట్టాలని జిల్లా హడపద(క్షౌరిక)సమాజ సేవ సంఘం డిమాండ్ చేసింది. ఈమేరకు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఆందోళనకారులు మట్లాడుతూ నగరంలోని ప్రాథమిక సహకార బ్యాంక్ ఆధీనంలోని దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు టెండర్లు పిలిచారన్నారు. డిపాజిట్ రూ.10 వేలు, నెలకు రూ.ఆ వేలు అద్దె నిర్ణయించారన్నారు. అయితే క్షౌ ర శాలల ఏర్పాటుకు దుకాణాలు ఇవ్వరాదని ప్రాథమిక సహకార బ్యాంక్ అధ్యక్షులు, పదాధికారులు, అధికారులు నిర్ణయించి హడదప సమాజాన్ని అవమానించారన్నారు. తమకు కేటాయించిన దుకాణాలు ఇవ్వక పోతే బ్యాంకు అధ్యక్షులు, అధికారులు, పదాధికారుల ఫొటోలు ప్రతి క్షవరం దుకాణంలో వేలాడ దీసి వారికి క్షవరం చేయరాదని తీర్మానం చేస్తామని హెచ్చరించారు.


