
డీఎం శ్రీనివాస్‌ను సత్కరిస్తున్న ఆర్‌ఎం వెంకన్న
ఖమ్మం మామిళ్లగూడెం : పరిశుభ్రత, ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనలో ఖమ్మం ఆర్టీసీ నూతన బస్టాండ్ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి ఉత్తమ అవార్డుకు ఎంపికై ంది. ఈ మేరకు ఆర్టీసీ కళాభవన్‌లో ఖమ్మం డీఎం శ్రీనివాస్‌ను ఎండీ సజ్జనార్ ఘనంగా సత్కరించి రూ.10 వేలు నగదు బహుమతి అందజేశారు. కాగా, ఆదివారం ఖమ్మం బస్టాండ్‌లో ఆర్‌ఎం సీహెచ్ వెంకన్న డీఎంను ఘనంగా సత్కరించారు. డీఎంతో పాటు సూపర్‌వైజర్లు, బస్‌స్టేషన్ సిబ్బందని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్టాండ్‌లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్‌ను 14వ నంబర్ ప్లాట్‌ఫాం ఎదురుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్టాండ్‌లో 24 గంటలూ అందుబాటులో ఉండేలా కార్గో సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో నెల రోజుల ముందుగా రిజర్వేషన్ చేయించుకునే ప్రయాణికులకు వారి తిరుగు ప్రయాణంలో చార్జీలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఓ రామ్మోహన్‌రావు, సీఐ రామిశెట్టి రామయ్య, సూపరింటెండెంట్ ఎ.నాగేశ్వరరావు, ఎస్‌ఏపీ శ్రీమన్నారాయణ, ఎస్‌ఎం రామకృష్ణ పాల్గొన్నారు.
పరిశుభ్రత, వసతుల కల్పనలో
రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్
Comments
Please login to add a commentAdd a comment