జిల్లాలో ముప్పై ఏళ్ల వయస్సు దాటిన వారిలో పలువురు రక్తపోటు, మధుమేహం సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ రెండు వ్యాధులు వారిని ఆస్పత్రుల పాలు చేస్తున్నాయి.
ఈనేపథ్యాన నాన్ కమ్యూనికబుల్ డిసీస్(ఎన్‌సీడీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమం అమలుచేస్తూ బీపీ, షుగర్ బాధితులను గుర్తించి వైద్యంతో పాటు మందులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో చేపట్టిన స్క్రీనింగ్‌లో 10 శాతం మంది బీపీ, 7.1 శాతం మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనల మేరకు వారు మందులు వాడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు జిల్లాలోని ఎన్‌సీడీ కార్నర్లు, క్లినిక్‌ల ద్వారా అందిస్తున్న సేవలు విస్తృతం కావడం, పెద్దసంఖ్యలో పరీక్షలు చేస్తుండడంతో బాధితుల సంఖ్య పెరుగుతుండగా, అదేస్థాయిలో చికిత్స కొనసాగుతోంది.
– ఖమ్మంవైద్యవిభాగం
Comments
Please login to add a commentAdd a comment