ఏ ఒక్కరూ వడదెబ్బ బారిన పడొద్దు
● జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన ● ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాల ఏర్పాటు ● టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్
ఖమ్మంవైద్యవిభాగం: నానాటికీ ఎండలు పెరుగుతుండడం, వడగాలులు మొదలయ్యే అవకాశమున్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుదవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి టాస్క్ ఫోర్స్ కమిటీతో సమావేశమయ్యారు. గత ఏడాది జిల్లాలో 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనందున, ఈసారీ అదే పరిస్థితి ఉండొచ్చని చెప్పారు. ఈమేరకు ఎండలో పనిచేసే నిర్మాణ కార్మికులు, కూలీలు, పారిశుద్ధ్య కార్మికుల వివరాలు సేకరించాలని, గత అనుభవాల దృష్ట్యా వ్యవసాయ మార్కెట్లలో టెంట్లు, తాగునీరు సమకూర్చడమే కాక ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అంతేకాక అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించే ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం అవగాహన కల్పించేలా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అదనపు డీసీపీ నరేష్‌కుమార్, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్, డీపీఓ ఆశాలత, డీడబ్ల్యూఓ కె.రాంగోపాల్‌రెడ్డి, ఎస్సీ డీడీ కె.సత్యనారాయణ, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ కె.వెంకటనారాయణ, వివిధ శాఖల ఉద్యోగులు నర్సింహారావు, ఎల్.రాజేందర్, నూరుద్దీన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు
ఖమ్మం సహకారనగర్: పిల్లల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో తప్పనిసరిగా బాలల సంరక్షణ కమిటీ సమావేశాలు నిర్వహించాలని, పిల్లలపై జరిగే మానసిక, శారీరక దాడుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులపై వేధింపులు నివారణ కోసం అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయంచాలని చెప్పారు.
చివరి ఆయకట్టుకూ సాగునీరు
జిల్లాలో చిట్టచివరి ఆయకట్టుకు సైతం సాగునీరు అందేలా కార్యాచరణ అమలుచేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. సాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి సమీక్షించిన ఆయన నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ సమస్యలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి పరిష్కరించాలన్నారు. డీఆర్వో పద్మశ్రీ, జలవనరుల శాఖ ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వర్లు, డీఏఓ పుల్లయ్య, ఆర్డీఓలు నర్సింహారావు, రాజేందర్ పాల్గొన్నారు.
చెల్లెమ్మా.. టీ బాగుంది!
ఖమ్మంరూరల్: అద్భుతమైన రుచితో టీ చేశారు.. చాలా బాగుంది చెల్లెమ్మా అంటూ కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సీ్త్ర టీ క్యాంటీన్ నిర్వాహకురాలిని అభినందించారు. కలెక్టర్ చొరవతో ఇందిరా మహిళా శక్తి ద్వారా మంజూరైన రుణాలతో జిల్లాలో 22 సీ్త్ర టీ క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. ఈమేరకు ఖమ్మం రూరల్ మండల పర్యటనకు వెళ్లిన కలెక్టర్ తరుణి హాట్ ఎదుట ఏర్పాటుచేసిన క్యాంటీన్‌ను పరిశీలించారు. ఈసమయంలో నిర్వాహకురాలు శ్రీరంగం గీత టీ అందించగా రుచి చూసిన కలెక్టర్ బాగుందని ప్రశంసించారు. నాణ్యత పాటిస్తూ ప్రజల్లో నమ్మకం చూరగొనడం ద్వారా వ్యాపారం విస్తరించుకోవాలని సూచించారు. తద్వారా ఖమ్మం బ్రాండ్‌కు పేరు తీసుకురావాలని ఆయన తెలిపారు. ఇందుకు యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా కల్పించారు. అనంతరం ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలా న్ని కలెక్టర్ పరిశీలించి సూచనలు చేశారు. తహసీల్దార్ పి.రాంప్రసాద్, గృహనిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాసరావు, పీఆర్ ఈఈ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏ ఒక్కరూ వడదెబ్బ బారిన పడొద్దు
Comments
Please login to add a commentAdd a comment