మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
ఖమ్మంరూరల్: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి సూచించారు. రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెంలోని పీహెచ్‌సీని గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించాక వారితో సమావేశమయ్యారు. ప్రజలకు అందుబాటులో ఉండడమే కాక మర్యాదపూర్వకంగా మెలగుతూ వైద్యసేవలు అందించాలని సూచించారు. ఏఎన్‌ఎంలు రక్షేత్రస్థాయిలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్‌లో భాగంగా 30ఏళ్లు నిండిన ప్రతీఒక్కరికి బీపీ, షుగర్ పరీక్షలు చేయాలని తెలిపారు. డాక్టర్ బాలకృష్ణ, ఉద్యోగులు వెంకటనారాయణ, చంద్రకళ, ఆజాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment