పనులు లేక, పస్తులు ఉండలేక..
నేలకొండపల్లి: ఉన్న ఊరిలో పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఎదురవడంతో తట్టుకోలేక పలువురు వ్యవసాయ కూలీలు వలస బాట పడుతున్నారు. కుటుంబాలతో ఇళ్లకు తాళాలు వేసి పనులు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు. మండలంలోని బైరవునిపల్లి నుంచి సుమారు పది కుటుంబాలు ఇప్పటికే వలస వెళ్లినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. గ్రామంలో ఉపాధి హమీ పథకం పనులు ప్రారంభించకపోవడం, కొంతకాలం ఇతర ప్రాంతాల్లో మిర్చి ఏరేందుకు వెళ్లినా ఆ పనులూ ముగియడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యాన కూలీలు కుటుంబాలతో సహా హైదరాబాద్, విజయవాడ ఇతరత్రా ప్రాంతాలకు వెళ్లారు. మరికొందరు వెళ్లిపోకముందే అధికారులు స్పందించి స్థానికంగా పనులు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
వలస బాట పడుతున్న కూలీజనం
Comments
Please login to add a commentAdd a comment