హమాలీ కార్మికులను ఆదుకోవాలి
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చే విధానాలు మానుకుని బస్తాలు మోసే హమాలీల సంక్షేమంపై దృష్టి సారించాలని టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, తెలంగాణ ప్రగతిశీల హమాలీ–మిల్లు వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. యూనియన్ నాలుగో రాష్ట్ర మహాసభలు ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. తొలుత నగరంలో ప్రదర్శన నిర్వహించగా, సమావేశంలో సూర్యం, శ్రీనివాసరావు మాట్లాడారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. కార్మికులకు కేంద్ర, రాష్ట్ర పాలకులు ఎలాంటి చట్టబద్దమైన హక్కులు కల్పించకపోవడంతో శ్రమదోపిడీకి గురవుతున్నారని తెలిపారు. ఇకనైనా కార్మికుల సంక్షేమం, హక్కుల కల్పనకు సమగ్ర చట్టాన్ని రూపొందించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పీఎఫ్ అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.రామయ్య, నాయకులు ఆవుల అశోక్, యాకూబ్‌షావలీ, ఎస్.కిరణ్ మాట్లాడగా ఏ.వెంకన్న, జక్కుల యాకయ్య, గొల్ల సీతారాములు, ఎం.నరసింహులు, ఎన్.శ్రీనివాసులు, ఏ.అంజనేయులు, కె.లక్ష్మణ్, కె.శ్రీనివాస్, కె.పుల్లారావు, బొమ్మకంటి రమేష్, నవీబాయి, గోపాల్, లూథర్, జగన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం
Comments
Please login to add a commentAdd a comment