
ప్రభుత్వ నిర్ణయంతో ‘రియల్’ రంగానికి జీవం
ఖమ్మంరూరల్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పరిష్కరించేలా రాయితీ ప్రకటించడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరిలూదినట్లయిందని రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఈసందర్భంగా ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట క్రాస్‌లో శుక్రవారం అసోసియేషన్ బాధ్యులు గరికపాటి ఆంజనేయప్రసాద్, తుంపాల కృష్ణమోహపన్ మాట్లాడారు. గత ఎనిమిదేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. రూ.కోట్ల విలువైన వెంచర్లు చేసినా 2020లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయొద్దని ఇచ్చిన ఆదేశాలతో ప్లాట్లు అమ్ముకోలేకపోయామని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్ రూపేణా నగదు చెల్లించినా సమస్య పరిష్కారం కాక హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే, సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించారన్నారు. ఈనేపథ్యాన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి రాయితీ ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన వారికి భరోసా కల్పించినట్లయిందని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలపడంతో చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అసోసియేషన్ నాయకులు కిషోర్, మన్నేటి నాగేశ్వరరావు, షాబాదు మాధవరెడ్డి, ఉప్పుగుండ్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment