సంక్షోభంలోకి వ్యవసాయ రంగం
ఖమ్మంరూరల్: కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న పాలకులు వ్యవసాయ రంగాన్ని మాత్రం సంక్షోభంలోకి నెడుతున్నారని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు విమర్శించారు. రూరల్ మండలం ఆరేకోడులో శుక్రవారం జరిగిన ఏఐకేఎస్ సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రధాని మోదీ పాత విధానంలోనే ముందుకెళ్తూ కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఇకనైనా రైతుల సమస్యలపై స్పందించి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని, రైతుభరోసా నగదు జమ చేయాలని, ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించగా, 21మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. సీపీఐ రాష్ట్ర కంట్రోల కమిషన్ చైర్మన్ ఎండీ.మౌలానాతో పాటు దండి సురేష్, మిడకంటి చినవెంకటరెడ్డి, పగిళ్ల వీరభద్రం, గోవిందరావు, పుచ్చకాయల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment