జిల్లాలోని ఖమ్మం నగర పాలక సంస్థతో పాటు వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల్లో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన భవనాలపై, ప్రభుత్వ భూములు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై అధికారులు ఇటీవల దృష్టి సారిస్తున్నారు. వైరాలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను గుర్తించి గత సెప్టెంబర్‌లో తొలగించారు. ఖమ్మం ఎన్‌ఎస్‌టీ రోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తి గోడ నిర్మించగా కూల్చివేశారు. ఇంకొన్ని చోట్ల అదనపు నిర్మాణాలను తొలగించారు. అలాగే, అనుమతి లేని నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసి జరిమానా విధిస్తున్నారు. అయితే, ఫిర్యాదు అందితేనే అధికారులు రంగంలోకి దిగుతున్నారనే విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తే అక్రమ కట్టడాలను ముందుగానే అడ్డుకోవచ్చు. కానీ నిర్మాణం చివరి దశలో ఉన్నప్పుడో, పూర్తయ్యాకో నోటీసులు జారీ చేసి జరిమానా విధిస్తున్నారు. ఒక్కోసారి కూల్చివేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment