కోయచలకలో అసిస్టెంట్ కలెక్టర్ పర్యటన
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం కోయచలకలో అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల వారి ఇళ్లకు వెళ్లి జీవన స్థితిగతులు, పంటల సాగు, ఆర్థిక వనరులపై ఆరా తీశారు. ఉన్నత విద్య పూర్తిచేసిన భువనేశ్వరి తదితరులతో మాట్లాడి భవిష్యత్ ప్రణాళికలు తెలుసుకున్నారు. అనంతరం చెరుకూరి రామారావు సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న పంటలను ఆయన పరిశీలించి దిగుబడి, ధరలపై చర్చించారు.వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు రాజ్యలక్ష్మి, ఆదాం, నాగరాజు, లింగరాజు, సీమా, నరేష్, మార్కెట్ డైరెక్టర్ చెరుకూరి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment