ఖమ్మంరూరల్: మండలంలోని పలు రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్‌కుమార్ బుధవారం తనిఖీ చేశారు. జలగంగనర్‌తో పాటు ఇంకొన్ని ఉన్నత పాఠశాల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన బియ్యం, కూరగాయలు, గుడ్లు అందించాలని తెలిపారు. ఆతర్వాత వరంగల్ క్రాస్‌లోని రైస్ మిల్లును తనిఖీ చేసిన ఆయన గడువులోగా సీఎంఆర్ అందించాలని ఆదేశించారు. తనిఖీల్లో సివిల్ సప్లయీస్ డీటీ విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాస్పత్రిలో సేవలపై ఆరా
కల్లూరు: కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిని మెడికల్ అండ్ హెల్త్ అడిషనల్ డైరెక్టర్, టాస్క్‌ఫోర్స్ టీమ్ లీడర్ కె.శశిశ్రీ, అసోసియేటెడ్ ప్రొఫెసర్ ఎం.విజయ్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ద్వారా ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, ప్రసవాల సంఖ్య, అందుబాటులో ఉన్న మందులు, వ్యాక్సిన్లపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలందిస్తూనే నిర్దేశిత లక్ష్యాలను నూరు శాతం సాధించాలని, అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ టి.సీతారామ్, డీపీఓ దుర్గ, వైద్యాధికారులు, ఉద్యోగులు రమేష్, నవ్యకాంత్, మౌనికాశృతి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment