ఆరుతడి పంటలతో నికర ఆదాయం
రఘునాథపాలెం: రైతులు ఆరుతడి పంటలుగా పెసర తదితర పంటలు సాగు చేస్తే మిగతా వాటితో పోలిస్తే నికర ఆదాయం లభిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) ధనసరి పుల్ల య్య తెలిపారు. రఘునాథపాలెం మండలం మంచుకొండలో పలువురు రైతులు సాగు చేసిన పెసర పంటను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పెసరను మారుక మచ్చల పురుగు ఆశిస్తుండడంతో పూత, పిందె రాలిపోతోందని తెలిపారు. దీని నివారణకు 1500 పీపీఎం వేప నూనె పిచికారీ చేయాలని, పురుగు ఉధృతంగా ఉంటే ప్లాత్రో, అంప్లిగో మందులను వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలని సూచించారు. ఏఓ కర్నాటి ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మొక్కల పెంపకంపై
నిర్లక్ష్యం వద్దు
కామేపల్లి: నర్సరీల్లో మొక్కల సంరక్షణ, పెంపకంపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ హెచ్చరించారు. మండలంలోని ముచ్చర్ల, కొత్తలింగాల, జాస్తిపల్లిలో బుధవారం పర్యటించిన ఆమె ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించారు. అలాగే, నర్సరీలను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఎండ తీవ్రత కారణంగా మొక్కలు చనిపోకుండా సంరక్షించాలని సూచించారు. ఉపాధి పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ కల్పించాలని తెలిపారు. ఎంపీడీఓ రవీందర్, ఈజీఎస్ ఏపీఓ శ్రీరాణీ, ఈసీ వెంకటేశ్వర్లు, టీఏ భాస్కర్, ఫీల్డ్ అసిసెంట్లు పాల్గొన్నారు.
కమనీయం..
రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గ ర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గా వించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment