విద్యతో సమాజంలో సమానత్వం
● చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం ● జయంతి వేడుకల్లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మంమయూరిసెంటర్: విద్యతో మాత్రమే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా గురువారం ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆమె విగ్రహానికి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో మార్పు, నవ సమాజ నిర్మాణం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తుల్లో చాకలి ఐలమ్మ ఒకరని, ఆమె పోరాటం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చెప్పారు. పాఠశాలల సందర్శనలో బాలికలు అధికంగా ఉండడం సంతోషం కలిగిస్తోందని తెలిపారు. బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, వివిధ సంఘాల నాయకులు కె.శ్రీలక్ష్మి, దుంపటి నగేష్, మేకల సుగుణారావు, గాలి అంజయ్య, పిండిప్రోలు రామ్మూర్తి, ముదిగొండ వెంకటప్పయ్య, ప్రొఫెసర్ డాక్టర్ బీ.వీ.రాఘవులు, జక్కుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
●ఖమ్మం సహకారనగర్: వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ఆమె చిత్రపటానికి అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీఆర్వో రాజేశ్వరి, సీపీఓ ఏ. శ్రీనివాస్, డీఐఈఓ రవిబాబు, ఏఓ అరుణ, కె.శ్రీనివాసరావు తదితరులుపాల్గొన్నారు.
చివరి ఆయకట్టు వరకు సాగునీరు
కూసుమంచి: సాగర్ ఆయకట్టు పరిధిలో చివరి ఎకరా వరకు సాగునీరు అందిస్తామని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. మండలంలోని పాలేరు ఎడమ కాల్వకు ఇటీవల గండి పడగా పూడ్చిన ప్రాంతం వద్ద నీటి సరఫరాను గురువారం ఆయన పరిశీలించారు. హట్యా తండా వద్ద గండి పూడ్చివేత సమయాన లీకేజీ నియంత్రణ కోసం యూటీ తొలగింపు, ఎదురవుతున్న అవాంతరాలపై ఆరా తీశారు. యూటీని పూర్తిగా తొలగించడంతో ఆ మార్గంలో వెళ్లే వరద నిలిచిపోగా భారీ మోటార్ల ద్వారా ఎత్తిపోస్తుండగా పరిశీలించి కట్ట పటిష్టతపై సూచనలు చేశారు. అనంతరం పాలేరులోని మినీ హైడల్ ప్రాజెక్టు వద్ద గండి పడగా పూడ్చిన ప్రాంతాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. ఇరిగేషన్ డీఈఈ అనన్య, తహసీల్దార్ సురేష్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment