
ప్రదర్శనలు, ప్రయోగాలతో విజ్ఞానం
ఖమ్మంఅర్బన్: పాఠశాలల విద్యార్థులకు పాఠాల బోధనతో సరిపెట్టకుండా అందులోని అంశాల ఆధారంగా ప్రదర్శనలు ఏర్పాటుచేయడం, ప్రయోగాలు చేయించడం ద్వారా విజ్ఞానం పెరుగుతుందని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. ఖమ్మం ఇందిరానగర్ పాఠశాలలో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యాన శనివారం ‘శాసీ్త్రయ అన్వేషణ–ఆవిష్కరణ’ పేరిట సైన్స్ మోడళ్లు, ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ స్మైల్ ఫౌండేషన్, షెల్ ఇండియా సహకారంతో రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంఈఓ శైలజాలక్ష్మి, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యుత్ సరఫరాలో
అంతరాయాలు రావొద్దు
చింతకాని: రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరగనున్న దృష్ట్యా అంతరాయాలు ఎదురుకాకుండా ముందుస్తు ఏర్పాట్లు చేయాలని ఖమ్మం ఎస్‌ఈ సురేందర్ సూచించారు. మండలంలోని చింతకాని, కొదుమూరు, పందిళ్లపల్లి, నాగులవంచ సబ్‌స్టేషన్ల ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ సబ్‌స్టేషన్లలో నిర్వహణ, మరమ్మతులు పూర్తిచేసి, అవసరమైన చోట్ల అదనపు ట్రాన్స్‌ఫార్మర్లకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలి పారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే రైతులు 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసేలా అవగాహన కల్పించాలన్నారు. డీఈ నంబూరి రామారావు, ఏడీఈ తిలక్, ఏఈలు శ్రీధర్, ఉమామహేశ్వరి, ఉద్యోగులు పాల్గొన్నారు.

ప్రదర్శనలు, ప్రయోగాలతో విజ్ఞానం
Comments
Please login to add a commentAdd a comment