నేలకొండపల్లి: పంట రుణం చెల్లించలేదంటూ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్మును జమ చేయించుకున్నారని ఓ వ్యక్తి ఆరోపించాడు. ఈ సందర్భంగా మండలంలోని మోటాపురానికి చెందిన నంబూరి నారాయణ శనివారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఆయన రాజేశ్వరపురంలోని బ్యాంకులో 2021–22 లో రూ.55 వేల పంట రుణం తీసుకున్నారు. అయితే, రుణం చెల్లించకపోగా ఆర్థిక ఇబ్బందులతో 2022లో భూమి విక్రయించారు. ఈ నెల వృద్ధాప్య పింఛన్ నగదు కోసం వెళ్తే నిరాకరించడమే కాక అధికారులు పంట రుణం చెల్లించాలని డిమాండ్ చేశారని వాపోయాడు. చివరకు పింఛన్ ఇచ్చినా రుణం చెల్లించాలని చెబుతూ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన రూ.55 వేలు బదలాయించుకున్నారని, ఇందుకోసం బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నారాయణ శనివారం వెల్లడించారు. ఈ విషయమై ఎస్‌బీఐ మేనేజర్ టి.నాగేందర్‌ను వివరణ కోరగా తాము నారాయణను బలవంతం చేయలేదని, ఆయన ఇష్ట్రపకారమే ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము జమ చేసుకున్నట్లు వెల్లడించారు. తాము బెదిరించారని చెప్పటం సరికాదని, పెన్షన్ విషయంలోనూ ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు.
బ్యాంకర్లు బెదిరించారని ఫిర్యాదు, అలాంటేదేమీ లేదన్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment