ఖమ్మంమయూరిసెంటర్: తాగునీటి సరఫరా పర్యవేక్షణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో అడుగు ముందుకు పడింది. ఈ నిర్ణయంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అమృత్ పథకం ద్వారా తాగునీటి సరఫరా బాధ్యతలను ఇకపై స్వయం సహాయక సంఘాల బాధ్యులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈమేరకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఆరు ప్రాంతాలను ఎంపిక చేశారు. ప్రాంతాల వారీగా ఒక్కో సంఘానికి అప్పగించి పంపు ఆపరేటర్‌ను అధికారులు కేటాయించారు. సంఘానికి రూ.10లక్షల చొప్పున నిధులు కేటాయించిన నేపథ్యాన ఆయా ప్రాంతాల్లో నల్లాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, పన్నుల వసూలు, లీకేజీల మరమ్మతు బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.
ఆరు ప్రాంతాలు కేటాయింపు
తొలిదశలో ఖమ్మంలోని కై కొండాయిగూడెం, బాలపేట, సీపీ ఆఫీస్ రోడ్డు, గుట్టలబజార్, శ్రీరామ్‌హిల్స్, రోటరీనగర్ ప్రాంతాల ట్యాంక్‌ల పరిధిలో బాధ్యతలను ఎంపిక చేసిన సంఘాలకు అప్పగించారు. ఆయా ట్యాంకుల పరిధిలో మరమ్మతులు చేయించడమే కాక నల్లా పన్నుల వసూళ్ల బాధ్యతలు నిర్వర్తించేలా అవగాహన కల్పించారు. ఈమేరకు ఇటీవల హైదరాబాద్‌లో శిక్షణకు వెళ్లివచ్చిన అధికారులు శనివారం సంఘాల సభ్యులతో సమావేశమై అమృత మిత్రల నియామకం, శిక్షణ, బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు.
ఖమ్మంలోని ఆరు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్
Comments
Please login to add a commentAdd a comment