ఖమ్మంవ్యవసాయం: కోళ్లలో వ్యాధులు, వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు సూచించారు. ఈమేరకు కోళ్లలో వైరస్ లక్షణాలు కనిపిస్తే నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏదైనా సమాచారం ఇచ్చేందుకు 91007 97300 వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేయగా, కోళ్ల పరిశ్రమల నిర్వాహకులకు అవగాహన కల్పించాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాలోని పశువైద్యాధికారులు కోళ్ల పరిశ్రమలను సందర్శిస్తూ స్థితిగతులను పరిశీలిస్తూ నిర్వాహకులకు సూచనలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment