ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాను క్షయరహితంగా తీర్చిదిద్దే ప్రయత్నాలకు అందరూ సహకరించాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు సూచించారు. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రెండు వారాలకు మించి దగ్గు ఉన్నా, రాత్రి పూట చమటలు పట్టినా, ఆకలి మందగించినా క్షయ వ్యాధి లక్షణాలుగా భావిస్తూ సమీప ఆరోగ్య కేంద్రంలో తెమడ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. ఒకవేళ టీబీ నిర్ధారణ అయితే ఉచితంగా మందులను ఇంటికి పంపిస్తామని, పోషకాహారం నిమిత్తం నెలకు రూ.వెయ్యి చొప్పున అకౌంట్‌లో జమ అవుతాయని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 35 జీపీలను క్షయ రహితంగా ప్రకటించగా... డీఎంహెచ్‌ఓ డాక్టర్ కళావతిబాయి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత మాట్లాడారు. అనంతరం వివిధ పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన సంజన(సత్తుపల్లి), ఏంజెల్(ఖమ్మం)కు బహుమతులు, టీబీ వ్యాధి నిర్మూలనకు కృషి చేసిన ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, హెల్త్ సూపర్‌వైజర్లకు అవార్డులు అందజేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్. కిరణ్‌కుమార్, వైద్యులు బాబురత్నాకర్, కిరణ్‌కుమార్, రామారావు, వెంకటరమణ, మోహన్‌రావు, తదితరలు పాల్గొన్నారు.
డీటీసీఓ డాక్టర్ సుబ్బారావు


