అడుగడుగునా అవాంతరాలే...
కొణిజర్ల: విత్తన కంపెనీల మాటల నమ్మి ఆడ, మగ రకం మొక్కజొన్న సాగు చేసిన రైతులు అడుగడుగునా అవాంతరాలు ఎదుర్కొన్నారు. కొణిజర్ల మండలంలో ఈ రకం మొక్కజొన్నలు 10వేల ఎకరాల్లో సాగు చేయగా, కొందరు రైతులకు చెప్పిన దిగుబడితో పోలిస్తే తక్కువ రాగా, మరికొందరికి ఎక్కువగా వచ్చాయి. చివరకు రైతులు కంపెనీల బాధ్యులకు మొక్కజొన్నలు అప్పగించారు. కాగా, మొక్కజొన్నలను తరలించే క్రమాన అకాల వర్షం కురవడంతో తనికెళ్లలోని ఓ వేయింగ్ మిషన్ వద్ద ఆరబెట్టారు. ఆపై కొన్ని బస్తాలను లారీలో తరలించగా, ఇంకొన్ని రోడ్డు పక్కనే కనిపిస్తున్నాయి.
తనికెళ్లలో రోడ్డు పక్కన వేసిన మక్కల బస్తాలు


